ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భూమిక..

మన యైదవజార్జి చక్రవర్తిగారి పట్టూ భిషేకమహూ త్సవపు దర్బారు గడచిన మాసమున నే నడచినదే యైనను దాని ప్రబల ఫలముల బట్టి యది ముఖ్య చారిత్రికాంశ ములలో ఒక్కటియని యంగీక రింపఁబడి యున్నది. కోట్ల కొలఁది జనులు దర్బారు నాటి కార్యములకు మహానందంబు సంది. ఆయానందంబుం వెలిఁబుచ్చ విద్యావంతులును గవు లును వేన వేలు గద్యరూపములును పద్యరూషములును గద్య పద్యాత్మకములును నగు వివిధ కృతుల మొనర్చియున్నారు. అందఱును పందొమ్మిదినందలపదునొకండవ సంవత్సరము డి సెం బరు మాసము పండ్రెండవ తేదీ మంగళ వారము అగునాదినము మహా సుదినంబని గ్రహించియున్నారు. ఆంగ్లేయులును భార తీయులును దమతమ కర్తవ్యములఁ బూర్ణముగ నెఱింగి పర స్పర గాఢానురాగముతో నేకపరిణామమునకయి నిండు ప్రయత్నములఁ జేయ నదను గలిగినది. మనసార్వభౌముండును ఆతని మంత్రిసత్తములగు లార్డుహార్డింగు లార్డు క్రూలును ఆతని యుదారహృదయమును 'వెల్లడించి మనయందు నూతన భావ ములఁ గల్పించి మనకొక నూతనవి కాసము గల్గును నర్చి