ఈ పుట అచ్చుదిద్దబడ్డది

టెక్కు ప్రభ్వీప్రభు లమరణము.

77


స్వాగతము విక్టోరియా నుహా రాజీగారి కైనను లండనుపుర ముననేని రాజ్యారోహణ షష్ఠిపూర్తి సమయము నందునఁ గూడ నియ్యఁబడ లేదఁట! ఇట్లు సుఖముగఁ బ్రారంంచి వా రైర్లాండులోని దర్శనీయ స్థలముల కన్ని టికిని బోయిరి. వారి రాకపోకలన్నియు వివరించు టనవసరము. వారయిర్లాండు సందర్శనమును ముగించు నప్పటికి జనుల యందు సాంద్రతమ మగు రాజభక్తి భావములఁ బురికొల్పి తమ యెడల 'నెప్పటికిని నశింపనేరని యనురాగమును బుట్టించిరనిన వారి సౌమనస్యత దెలియఁ గలదు.

టెక్కు- ప్రభ్వీ ప్రభ్వుల మరణము.

ఐర్లాండున నుండఁగ నే ప్రభ్వి తల్లియగు టెక్కు ప్రభ్వి జబ్బు పడెనను కించిద్దుఃఖ కరమగు వార్త వచ్చెను. ఔషధ సేవ జేయింప నామె యష్పటికిఁ గొంత గుదురు పడెను. కాని యక్టోబరు 25వ తేది మరల నామెకు బలమగు వ్యాధి తటస్థిం చెను. ఒక పర్యాయ మదివి కెరణ చికిత్స చేయఁబడిన యెడనె రెండ వమారును నదే చికిత్స చేయవలసి వచ్చెను. ఆమె కా చికిత్స వలన గుణము కాలేదు. 27వ తేది యక స్మాత్తుగఁ గాల గతి నొందెను. అప్పటికి మేరీ ప్రభ్వి యింగ్లాండు సేరియుండెను. కావునఁ దల్లి మరణము నామె చూడ వలసిన దయ్యెను. సంవ త్సరమున కైదు వేల పౌండ్లా దాయము మాత్రము గల దైనను టెక్కు ప్రభ్వి దీర్చుచుండిన యపారమగు లోకోపకార కార్య