పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/54

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

వాయిదాలమీదను రానేరదు. అట్టిది మన కక్కఱ లేదు సంపూర్ణమైన స్వరాజ్యమే మనఆశయము. దానికొఱకై మనము పోరాడుచున్నాము. దానిని పొందుటయా? వదలుటయా? నిర్ధారణ చేయవలయును.”

వీరిని నిర్బంధించగానే కలకత్తా పౌరస్త్రీలు ఖద్దరుబట్టలనమ్ముటకును, విదేశవస్త్రములను కొనకుండ చేయుటకై యత్నములు సాగించిరి. అందుకు చిత్తరంజనుని భార్య వాసంతిదేవియు; ఊర్మిళాదేవి, సునీతి దేవియును మువ్వురును బహిరంగముగాఉద్యమమును కలకత్తాలో ప్రబలపఱచుటకు యత్నములు చేయగానే పోలీసులు వారిని సైతము నిర్భంధమున నుంచిరి. కాని, వెంటనే వదలిరి. అయి తే పట్టుబడగానే వారుకలకత్తా సాధ్వీమణుల కిట్లు సందేశ మంపిరి -

సాధ్వీమణులకు సందేశము.

“మేము పట్టుబడుటకు సిద్ధమయ్యే బయలుదేరితిమి. మాబిడ్డలు దేశయువకులు దేశసేవాపరాయణత్వమున కారాగారమున బంధింపఁబడుచుండవారి తల్లులమగు మాకు మాయిండ్లలో నుండుట పెనుమంటయందు వై చినట్లైనది. మాసోదరీమణులగు .