పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/46

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

మగు భిన్నభావములు జనించినవి. అయినను సభలో కలవరముకలుగక శాంతముగా, జయప్రదముగా ఆ యేటి కాంగ్రెసుసభ ముగిసినది. తాను తన మనస్సున నేది సరియని తీర్మానమునకు వచ్చునో దానిని అనాలోచితముగ తీర్మానించు స్థిరబుద్ధిగలవాఁడు చిత్తరంజనుఁడు. ఎదుటివాఁడు ఎట్టివాఁడైనను తన నిర్ధారించిన యోచనను పూనికతో నెరవేర్చువరకొక కాలిపై నిలుచునంతటి ధీరచిత్తుఁడు చిత్తరంజనుఁడు. కలకత్తాలో జరిగిన ఖిలాఫత్ విషయిక మహాసభలో గాంధిగారియుద్యమమునకు చిత్తరంజనులు వ్యతి రేకముగ పాటుపడిరి. ఈయుద్యమమున హిందువులు ప్రవేశించుట సరికాదని అప్పట్లో చిత్తరంజనుని తలంపు. అయితే ఈతలంపును మార్చి 1920-వ సంవత్సరమున జరిగిన ఖిలాఫత్తు విషయమైన మహమ్మదీయులసభకు చిత్తరంజనులు తోడ్పడి వారియుద్యమమున పట్టుదలతో పనిచేయుటకు ప్రారంభించెను. దేశీయమహాసభలో గాంధిమహాత్ముని తీర్మానము అసహాయోద్యమముపట్ల జయమొందెను. దాని ననుసరించి నెలకు 30, లేక 40 వేల రూపాయలను గడించుచుండిన చిత్తరంజనుడు తనన్యాయవాదవృత్తిని వదలవలసివచ్చెను. ఇంతత్యాగమున కొడిగట్టినవాఁడే గదా ఈమహనీయుఁడు.చిన్ననాట