పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/45

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

43

కుశాధికారవర్గముయొక్క చర్యకు నిరాయుధులగు భారతీయులకు తప్పక శరణ్యమని దీర్ఘాలోచనము చేసి తీర్మానించి, తానును ఉద్యమమునకు లొంగెను; పంజాబు దురంతములను విచారించుటకు దొరతనమువారొక కమిటీని ఏర్పఱచిరి. ఆకమిటీ నివేదికలో యథార్థము వెల్లడికాదని గుఱ్తించి కాంగ్రెసుసభతరఫున మహాత్మాగాంధి, చిత్తరంజనులు, జయకర్, తయాబ్జీ మున్నగు సభ్యులతోఁగూడిన నొకకాంగ్రెసు ఉపసంఘము అమృతసరములోఁ గూడి విచారణకు ప్రారంభించెను. నెలకు ఎన్నియోవేల రూపాయలను ఆర్జించుచుండిన చిత్తరంజను లీప్రజోపయోగ కార్యమగు పై కమిటీ సభ్యత్వమున కియ్య కొని రెండునెలలు తన న్యాయవాదవృత్తిని వదలి అమృతసరములోనుండెను.

1919-వ సంవత్సరమున అమృతసరమున డిసంబరునెలలో దేశీయమహాసభ కూడెను. ఇందు చిత్తరంజనులు సభకు నాయకమణియై ప్రకాశించెను. ఈసభాసమావేశమునందు మహాత్మా గాంధిగారును, చిత్తరంజనులును కొన్నితీర్మానములలో భిన్నాభిప్రాయు లైరి. ఇండియామంత్రి మాంటాగూగారికి దేశీయమహాసభ తరఫున వందనము లర్పింపవలయునను తీర్మానమునందు దేశీయనాయకులలో తీవ్ర