పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/4

ఈ పుట ఆమోదించబడ్డది

5

వెచ్చించుచుండినందున చేత నొక్కకాసైనను నిలువనుంచికొన్నవాఁడు కాఁడు. ఇట్లు ఆర్జించిన ద్రవ్యమునంతయు వెచ్చించి అప్పులపాలై వృద్ధాప్యము నందు ఇన్ సాల్వెంటని హైకోర్టుగుండా పత్రమును బొంది అప్పులవారిబాధను తొలగించికొనవలసిన వాఁడయ్యెను.

బాల్యదశ.

ఇట్టి సుప్రసిద్ధన్యాయవాదులయొక్కయు, దాన ఔదార్యగుణయుతులయొక్కయు వంశమున కలకత్తానగరమున భువనమోహనునకు 1870-వ సం॥ ననంబరు 5-వ తేదినాఁడు మన కథానాయకుఁడు చిత్తరంజనుఁడు జన్మించెను. శైశవము గడింపగానే చిత్తరంజనుఁడు భవానిపురము నందుండు లండన్ మిషనెరీ సొసయిటీ స్కూలునందుచేరి 1886-వ సంవత్సరము ప్రవేశపరీక్షయం దుత్తీర్ణుఁడయ్యెను. పిదప కలకత్తా ప్రెసిడెన్ సీ కాలేజి ప్రవేశించి 1890-వ సంవత్సరము బి. ఏ. పట్టము నొందెను. వెంటనే ఇండియన్ సివిల్ సర్వీసు ఉద్యోగ పరీక్ష నిచ్చుటకు ఇంగ్లాండుకు తర్లెను. సివిల్ సర్వీసు పరీక్షా పత్రములనువ్రాసి ఫలితమునకై వేచియుండఁగా భారతపితామహుఁడు సుప్రసిద్ధ దాదాభాయి నౌరోజీ పార్లమెంటు సభ్యుఁడగుటకు యత్నములు సేయు