పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/39

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

37

సంఘమునకు వలసిన ముఖ్యమైన యేర్పాట్లయొక్క సూక్ష్మప్రణాళిక ఇట్టి నిబంధనలపై ఆధారపడవలయును. దీనికే స్వరాజ్యము, లేక గ్రామస్వపరిపాలనమని పేరు. ఇట్టిపద్ధతి మన దేశములో ప్రాచీనకాలమునందుండి సాగుచుండెను. ఇవి మనజాతీయతాభి వృద్ధితో పెరిగెను. వీనికని మనజాతీయతకును ప్రత్యేకమైన ఒద్దికగలదు. చిత్తరంజనుఁడు ప్రాచీన పద్ధతుల కే మనలను మరల్చెను. కాని, ఇందు నూతనము లేమియు లేవు. ఇట్లు సాంఘికాభివృద్ధికి, దేశాభ్యుదయమున కీ దేశభక్తుఁడు ఈపరోపకారి పాటు పడెను.

రాజకీయములు.

చిత్తరంజనుని దేశభక్తి కొంతవఱకు దెలిపితిమి. అతఁడు ప్రస్తుత రాజకీయవాతావరణమున ప్రవేశించుట మొదటి సందర్భము. ఆనిబిసెంటును మదరాసురాజధాని దొరతనమువారు నిర్బంధావాసమున నుంచుటతో ప్రారంభమైనది. 1917సం॥ జూలై 17 వ తేదీనాడు కలకత్తాపురజనులు ఆనిబిసంటును నిర్బంధించినందులకుగాను ఒక అసమ్మత సభాసమావేశమునుగావించిరి. ఆసభలో చిత్తరంజనుఁడు రాజకీయోపన్యాసమును గావించి తనకుండు ప్రస్తుతదొరతనపు విధానములోని అసమ్మతిని బయలుప