పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/37

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

35

సభలలో ఫిర్యాదుచేయవలయుననియు, ఆజిల్లా సభ్యుల తీర్మానము ననుసరించియే ఉభయకక్ష దార్లును నడుచుకొనవలయును. పెద్దగ్రామములలో పంచాయతీలను గ్రామములోనుండు పెద్దలును నిష్పక్షపాతబుద్ధిగలవారు పదుగు రున్నప్పుడు వారిలోనుండి 5 గురిని అధికసంఖ్యాక సమ్మతులను బడసినవారినేరి ఏర్పఱచు కొనవలయును. చిన్నచిన్నపల్లెలు జనసంఖ్యప్రకారము పదిపల్లెలో అయిదుపల్లెలో ఒక నియమితజనసంఖ్య గలవిగా జేసికొని ఆపల్లెలలోని పెద్దలను నిష్పాక్షికబుద్ధిగల వారిని 5 గురిని పై పెద్దగ్రామములలోవలెనే యేర్పఱచుకొన వలయును. ఇట్లే ఈగ్రామపంచాయతుల నుండి జిల్లాసభ్యులను జేర్చవలయును. ఈజిల్లాసభ్యులు సుమారు 200 మొదలు 500 వఱకు ఉండవలయును. ఈజిల్లాసభ్యులు 1. గ్రామపంచాతీలుసరిగా పనిచేయుచున్నారా యని వారికి పై యధికారులుగ ప్రవర్తించవలయును. 2. పంచాయతీల కార్యవిధానములను ఈజిల్లాసభ్యులు సూచించు చుందురు. ఈజిల్లాసభ్యులు జిల్లాముఖ్యపట్టణము యొక్క ఆరోగ్యపరిస్థితికి, ఆపట్టణపు బాలురవిద్య కొనసాగుటకును పూచీదార్లుగనుందురు. 3. ఆజిల్లాసభ వ్యవసాయాభివృద్ధికరములగు సూచనలను