పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/29

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

దేశసేవ, దేశక్షేమము ఇవిరెండును వారికి హృదయాహ్లాదకరములు. వీనికై తన సర్వస్వమును దారపోసెను. సమయము తటస్థించినప్పుడెల్లను వానికై తనకాలమునంతయు వ్యయపరచుచుండెను. మన చిత్తరంజనుఁడు పల్లెటూళ్లలోనిప్రజల అనారోగ్య స్థితి, విద్యావిహీనత చిత్తరంజనుని చాలా చింతించున ట్లొనర్చినవి. మన హిందూజాతి ఉద్ధరింపఁబడవలయునన్నచో పల్లెటూళ్లలోనివారి దుస్థ్సితిని మానునట్లు యత్నించవలయును. విక్రమపురపు ప్రజాభివృద్ధికొఱ కొక సంఘమునేర్పఱచి ఆసంఘాభివృద్ధికై విశేషద్రవ్యసహాయముచేసెను. ఇట్లుండ 1919-వ సంవత్సరమున తూర్పుబంగాళా రాజ్యమును కాటక మావరించెను. జను లన్నములేక మడియసాగిరి. ఆ సమయమున చిత్తరంజనునిచే స్థాపింపఁబడిన పై సంఘము చిత్తరంజనుని సాయముచే కాటకనివారణ బహుకార్యములను చేసినది. ఇందుచే బీద లనేకు లోదార్పఁబడిరి. అంతేగాక పై సంవత్సరారంభమున తూర్పుబంగాళాలో గొప్ప తుపాను వీచెను. పద్మానది విస్తారమగు వెల్లువతో ప్రవహింపసాగినది, వర్షారంభమున కాటకమును వర్షాంతమున ప్రవాహమున్ను దేశము నింతింతనరాని ఈతిబాధలపాలొనర్చి పండిన పైరునకు, పశువులకు ప్రజ