పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/2

ఈ పుట ఆమోదించబడ్డది

దేశబంధు

చిత్తరంజన దాసుగారి

జీవితచరిత్రము.


శ్రీయుత చిత్తరంజన దాసుయొక్క పూర్వులుండిన విక్రమపురము తూర్పు బంగాళాదేశమునకు ఆభరణాయ మానంబై పద్మ, మేఘనా నదులచే నావృతమై యొప్పారుచున్నయది. ఇయ్యది ఒకానొకప్పుడు సింహళము, సుమిత్ర దీవులతోను అరేబియా దేశముతోను విస్తారముగ వ్యాపారము సలుపుచుండు వర్తకులకు నెలవై యుండెను. చీనా దేశమునందుండి భారతదేశమున బౌద్ధమతౌన్నత్యమును కన్నులారగని యానందించుటకువచ్చిన హయూన్ త్సాంగునకు ఉపాధ్యాయుఁడైన బ్రాహణరాజు శిలానద్రుఁడు జన్మించిన దిచ్చోట. సుప్రసిద్ధనాస్తికమతో పాధ్యాయుఁడగుదీపాంకుర శ్రీజ్ఞానుఁడు పుట్టినదిక్కడనే. నాలందలో ప్రశస్తిగాంచియుండిన బుద్ధదేవాలయపు విఖ్యాతిఁ జెందిన పూజారి వీరభద్రుఁ డనువాఁడు సైతమందే పుట్టెను. ఈవిక్రమపురమునకు 'టెలిర్ బాగ్' అను చిన్న గ్రామము మజరాగా నున్నది. ఈపల్లెయే స్వార్ధత్యాగపరాయణుఁడును, దేశబంధువును, విశేషశేముషీ యుతుఁడును, కలకత్తా న్యాయ