పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/10

ఈ పుట ఆమోదించబడ్డది

11

చెను. అప్పటినుండి ఆయన ఇంటినుండి పెద్దమ్మ తొలఁగి చిన్నమ్మ కాపురము కుదుర్చుకొన సాగెను.

తనతండ్రిగారి ఋణములను తాను దీర్చెదనని ప్రథమమున పూనికొని తీర్చలేక ఇన్ సాల్వెంటు పత్రమును దాఖలుచేసె ననియు, అట్లు చేయుటచే అప్పులవారిని మోసపుచ్చి కృతార్థుఁడు కావలయుననుట కాదని ఇదివరలో వ్రాసియుంటిమి. ఇప్పుడు ధనము చేకూరసాగగా తన పూర్వపు అప్పులవాండ్ర నందఱనుగూర్చి వారివారి కాతేదివర కచ్చవలసిన వడ్డితోటి అసలు పైకమంతయు నిచ్చి పిత్రూణమునుదీర్చి కృతార్థుఁ డయ్యెను. ఇట్టిచర్య కద్భుతపడి ఫ్లెచ్చరు అనున్యాయమూర్తి విడుదల కాఁబడిన ఇన్ సాల్వెంటు తనపాతబాకీల నొప్పికొని వాటిని వడ్డీసహా తీర్చుట చోద్యమనియు, ఇట్లు తీర్చిన చిత్తరంజనునివంటివానిని తాను చూచుట కిదియే ప్రథమమనియు బహిరంగమైన న్యాయస్థానమున నుడివెను. ఈయద్భుతమైన చిత్తరంజనునిచర్య వానిని మహానీతిపరుఁడుగను లోకోత్తరుఁడుగ నెన్నికొనునట్లొనర్చినది.

కలకత్తా హైకోర్టు కేసు లన్నింటిలో నొకతట్టు వాదము చిత్తరంజనునిదిగా లేని కేసేదియు లేదు. ఇట్టి విస్తారకార్య మగ్నుడై యుండుకాలమున నెల