పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/78

ఈ పుట ఆమోదించబడ్డది

1O

కొందరు వ్యక్తులు

ఆ కాలమున బ్రాహ్మణులలో ప్రసిద్ధికెక్కిన భాగ్యవంతుడు ధర్మాత్ముడు మందపాటి రామకృష్ణయ్యగారు. వీరికి మద్రాసులో అనేక కట్టడము లుండెడివి. అమంజికరెలో ఒక వుద్యానవనమును అందులో దివ్యమైన భవనము నుండెడివి. అప్పుడప్పుడు ఆ తోటకు స్నేహితులతో కూడ వచ్చి కేళీవిలాసాదులతో కాలము గడుపుచుండేవారు. వీరు కీ|| శే|| విజయనగరం మహారాజా ఆనందగజపతివారికి స్నేహితులు. రాజకళతో నొప్పు వీరు శ్రీ మహారాజావారి సరసన కూర్చుండి, జోడుగుర్రాలబండిలో తిరువత్తియూరు దేవాలయమునకు వెళ్లునపుడు చూడముచ్చటై దారిపొడవున జనము విరుగబడి చూచేవారట. వీరి భార్యగారు ఏడువారముల సొమ్ములు, అతి విలువ గలవి ధరించేవారట. వీరికి స్నేహితులు జాస్తికాగా, వారికుండిన ధనాదులు హరించిపోయినవి.

డాక్టరు వరదప్పగారిది బ్రహ్మసమాజపు మతము. సుమారు 6 అడుగుల ఎత్తున ఒడ్డూ పొడవుగల భారీమనిషి పెద్ద గడ్డమును గలవారు. బర్మాయుద్దములో పనిచేసిన వారు. వీరు ముఖ్యముగ ప్రసవముల చికిత్సలకు పేరుపొందినవారుగ నుండినను అన్ని వ్యాధులను సమర్థతతో వైద్యము చేయుచుండిరి. చనిపోయిన డాక్టరు రంగాచారికి యుండిన ధర్మబుద్ధి ఆ కాలమున వరదప్పగారికి యుండెను. పేదవార్లను దయతో చూచి ధర్మముగ చికిత్సను చేయుచుండెను. ఇంటికి వచ్చినపుడు డబ్బిచ్చిన (Visiting fee) వారు పేదవారని తోచినచో ఆడబ్బును వారికి మరల యిచ్చి రోగికి పాలకు, గంజికి ఖర్చుపెట్టమనేవారు. విద్యార్ధులకు సహాయము చేయుచుండువారు. దాత; దయాపరులు. వారు స్థాపించిన అనాథ శరణాలయము యిప్పుడు