పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/76

ఈ పుట ఆమోదించబడ్డది

68 చిన్ననాటి ముచ్చట్లు

Esplanade లో యున్న క్రొత్త Y.M.C.A భవనము కూడా నా కళ్లయెదుట కట్టబడినదే. ఈ భవనమును కట్టకముందు ఈ సంస్థ హైకోర్టు యెదుట ఒక చిన్నమేడలో ఉండినది. అక్కడ బుక్కీపింగ్, టైప్ రైటింగ్ షార్ట్ హాండు(Book-keeping, Typewriting, Shorthand) మొదలగు విద్యలను నేర్చించుచుండిరి. నేను కూడ ఆ క్లాసులో చేరి షార్ట్ హాండు టైప్ రైటింగ్(Shorthand & Typewriting) విద్యలను నేర్చుకొనుచు ఆ సంస్థలో సభ్యుడనైతిని. పిమ్మట క్రొత్తగ కట్టిన భవనమునకు సంస్థ చేరగనే నేనుకూడ అక్కడచేరి శాండో యక్సరసైజు (Sandow Exercises) మొదలగు (Indoor Games) వ్యాయామములను నేర్చుకొనుచుంటిని. ఈ Y.M.C.A. తో అప్పటినుండి నాకు సంబంధము గలదు.

సెంట్రల్ స్టేషనుకు ప్రక్కన కట్టియున్న (M.S.M) మదరాస్ అండు సదరన్ మహారాష్ట్ర రైల్వే ఆడిట్ ఆఫీసుకట్టడము ఇతర కట్టడములు కట్టినదికూడ నాకు తెలుసును. ఈ ప్రదేశమున ముందు పార్కు (తోట) యుండినది. ఆ కారణము వల్లనే ఈ ప్రాంతమునకు పార్కుటువున (Park Town) అని పేరు వచ్చినది. ఈ కట్టడము ప్రక్కననే పార్కుటవున్ పోస్టాఫీసు కట్టడము కలదు. ఈ రైల్వే ఆడిట్ ఆఫీసుకూడ తాటికొండ నంబెరుమాళ్ల శెట్టిగారే కంట్రూక్టుకు తీసుకొని కట్టించిరి. సెంట్రల్ స్టేషన్ ఆరంభమున కట్టినది నాకు తెలియక పోయినను పిమ్మట క్రమముగ దానికి చేర్చికట్టిన ప్లాటుఫారములు వగైరాలు నాకు దెలియును. ముందు పాతస్టేషన్ రాయపురమున నుండినది.

మద్రాసు కార్పోరేషను (రిప్సన్) భవనమును కట్టుచుండినప్పుడు, నేను సుగుణ విలాస సభ మెంబరుగ నుండి దానిని కట్టిన విధమును చూచుచుంటిని. అప్పడు సుగుణ విలాస సభ విక్టోరియా పబ్లిక్ హాలు