ఈ పుట ఆమోదించబడ్డది

82

చీనా-జపాను

క్రింద వున్నాయి.ఇటలీ యిారీతిగ సామ్రాజ్యకాంక్షను పెంచుతూవున్నా, ఆబీసియాను మ్రింగినా బ్రిటిషు, ఫ్రాన్సు, దేశాలవారు గట్టిగా తమ అదుపు ఆజ్ఞలో ఇటలీని యుంచలేకపోయారు.

జర్మనీ

జర్మనీకి వలసరాజ్యాల కాంక్ష మొదటనుంచీలేదు.జర్మనీ తనచుట్టుపట్లనుండే దేశాలన్నిటికి ఆధిపత్యాన్ని సంపా దించాలనే కోరికతో వుండెను.

1884 నుండి జర్మనీ దేశములోని ఫాబ్రి అను ఆయన వలసరాజ్యాలకు ఆందోళన చేయుటకు గ్రంధముల ద్వారాను ,పత్రికద్వారాను, సభలవల్ల అమిత ఆందోళన చేసెను.ఈ ఆందోళనవల్ల ప్రజలలో అలజడి కలిగినది. దానివల్ల 1884, 1914 సమ్||మధ్య జర్మనీ ఆఫ్రికాలోను, పసిఫిక్ మాహాసముద్రంలో జపాను ఆస్ట్రేలియా మధ్యను కొన్ని వలస రాజ్యాలను బిస్‌మార్కు పరిపాలనలో సంపాదించెను.

1914-18 మహాసంగ్రామములో సంపాదించిన వలసరాజ్యాలను వెర్సల్లీసు సంధిద్వారా కోల్పోయెను. వీటిని ఇంగ్లండు, ఫ్రెంచివారే హెచ్చుగా పంచుకొన్నారు.వెర్సల్లీసు సంధిలో జర్మనీని, ఆర్థిక, సాంఘిక, రాజకీయంగా బ్రిటిషు, ఫ్రాన్సు, అమెరికావారు క్రుంగిపోవునట్లు జేసిరి.ఆదుస్థితిలో