ఈ పుట ఆమోదించబడ్డది

80

చీనా-జపాను

¶¶¶ జపాను ¶¶¶

17,18 చ శతాబ్దములలో జపానులో రమారమి 2 1/2 కోట్ల కన్న హెచ్చుగా జనాభాలేదు. రాజకీయ దృష్టి రీత్యా జనాభా హెచ్చుట అవసరమనే ప్రచారం ఆదేశంలో సాగడంవల్ల 1846 లో 3 1/4 కోటి వరకున్ను 1882 లో 4 1/2కోటి వరకున్ను 1903 లో 6 కోట్లవరకు 1925 లో7 కోట్ల వరకు పెరిగింది. జనాభాతో పాటు వర్తక పరిశ్రమను విజ్ఞానమును పెంపొదింప జేస్తూ బ్రిటిషువారితో అన్నివిధాల సమానంగా నుంటూ బ్రిటిషువారు పశ్చిమమున బలంగానుంటే జపాను వారు తూర్పున బలంగా నుండుటకు యత్నిస్తున్నారు.

జపాను 1891 నుంచి క్రమేణా వారు ఫార్మోజ్‌ కొరియా, మంచూకో ప్రదేశాలను ఆక్రమించి చైనాదేశాన్ని కబ ళించుటకు 1931 నుండి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.ఈయత్నాలవల్ల చైనా జపానుదేశాలకు యుద్ధం1931 నుండి జరుగుతూనేవుంది. అటు రష్యాతో డీకొని 1904 లో జపానే జయము గాంచెను.దీని వల్ల జపానుకు రష్యాకు మైత్రి సంభవించలేదు. అందుకు తగినట్లు జపాను కుండే సామ్రాజ్యకాంక్షకు రష్యాయొక్క సోవియట్టు తత్వం వ్యతిరేకం.ఇందువల్ల యిా రెంటికి బలమైన విరోధమే హెచ్చు అవుతోంది.చైనాను జపాను దిగ మ్రింగ డానికి చేసే యత్నాలలో బ్రిటిషువారు జపానును గట్టిగా అడ్డగించలేదు.