ఈ పుట ఆమోదించబడ్డది

64

చీనా-జపాను

సమ్మెకట్టి జపానుకు ప్రతిఘటనమును ప్రకటించినది.టీన్‌స్టిన్‌ నగరవిద్యార్థులు వీరికి తోడైరి.ఇంకెందరో విద్యా ర్థులు కూడ వీరితోకూడిరి.ఈ ఉద్యమము కళాశాలలనుండి హైస్కూళ్లుమిడిలుస్కూళ్లకు కూడా వ్యాపించినది. చీనా అంతటను ఒకటే కేకలు:

(1)ఉత్తర చీనా విడిపోరాదు.

(2)ఉత్తరచీనా పౌరులకు సాయము చేయవలెను.

(3)చీనాకు ప్రతికూలమైన రాయబారములను నిరాకరించవలెను.

(4)నాంకింగు ప్రభుత్వము విదేశముల దాడి నెదుర్కొనవలెను.

(5)చీనాయంతయు సంయుక్తము కావలెను.

(6)చీనాలో ఒక అంగుళము మేరయైనను విదేశీయులలు లోబడరాదు.

1936 జనవరి 15వ తేదిని చియాంగు కాయేషేకు కాలేజి ప్రొపెసర్లు, స్కూలుమేష్టర్లు మొదలగువారిని పిల పించి వారికి సంగతి సందర్భములెల్లయు బోధపరచెను.విద్యార్థులు కొంతవరకు సమాధానపడినట్లు కనిపించిరి. కానివారి ప్రశ్నల కన్నింటికిని చియాంగుకాయేషేకు సరియైన సమాధానములను చెప్పక తనశక్తినంతటిని కమ్యూనిష్టుల నణచుటయందే కేంద్రికరించుచుండుట చేత వారి ద్వేషము క్రమేణా మరింత వృద్ధియైనది-చియాంగు కాయ్‌షేకు సరియైన సమాధానములను చెప్పక తప్పదు.