ఈ పుట ఆమోదించబడ్డది

60

చీనా-జపాను

లలో మంగోలుభాష, సేనలు మంగోలియా సేనలు, ఉద్యోగస్థులు మంగోలియనులు, వ్యవహారములు మంగోలి యాకు లాభప్రదములు:రెయిల్వేలు మొదలైనవి మంగోలియా స్వాధీనములో ఉన్నవి.రష్యా తూర్పుదేశ అంత ర్వ్యవహారములలో ఎట్టి జోక్యమును కలిగించుకొనదు.పరిశ్రమలు ఆధునిక పద్ధతులతో నడుచుచున్నవి.

దీనికంతకును కారణము రష్యాకు సామ్రాజ్యతత్వదురాశలులేకుండుటయే.1925 లో టర్కీతోను, 1926 లో అప్గనిస్థానముతోను,1927 లోపెర్షియాతోను పరస్పర స్నేహము, ఆక్రమణ విరుద్ధము అయిన ఒడంబడికలను చేసుకున్నది.మంగోలియా రష్యాచేతిలో కీలుబొమ్మ రాజ్యము కాదు.మంగోలియా రష్యాకు లొంగివున్న కంటె స్వతంత్రమై వుంటేనే రష్యాయొక్క తూర్పుదేశవ్యవహారనీతి కెక్కువ అనుకూలము.1933 లో రష్యా బలవంతమై యుంటే జపాను మంచూకోను స్వాధీనము చేసుకొనలేకుండేడిదట.మంచూకో స్వాధీనమైనంత మాత్రమున జపాను మంగోలియా రిపబ్లికుమిాద సులభతరముగా దాడి వెడలగులుగు ననుకొనుట కల్ల.మంగోలియాకు రష్యాపూర్ణముగా అండనిలచి యున్నదిగనుకనే జపాను ఆటలు సాగకున్నవి. మంగోలియా సరిహద్దులో జపాను ఎన్నో పితూరీలు రేపినది కాని దండయాత్రకు పూనుకొనలేకున్నది.జర్మనీ రష్యామిాదికి దాడి వెడలినను, జపాను దక్షిణచీనా, మధ్య చీనాలమిాదికే తగులునుకాని మంగోలియా మిాదికి వెళ్ళగలుగునేమో సందేహమే.