ఈ పుట ఆమోదించబడ్డది

58

చీనా-జపాను

తాను వేరే రిపబ్లికుగా ప్రకటించుకొనెను. లోపలి మంగోలియా మిాద చీనా అధికారము కలిగి యుండగోరెను గాని అదిసాగలేదు.కనుక ఈ రెండు రాష్ట్రములును అప్పటినుండి చీనాతో సంబంధము లేక స్వతంత్రముగానే ఉన్నవి.

క్రమక్రమముగా ఉత్తరమంగోలియాకు చీనాతోకంటె రష్యాతోనే సంబంధము ముదరజొచ్చెను.ఈదేశమునకు ఉర్గా నగరము రాజధాని, రష్యా సహాయముతో ఇక్కడ శాంతి నెలకొనెను. మధ్యయుగమునాటి జమిాందారీ తత్వము వదలిపోయెను.పశువుల మందలు పెరిగెను.1911-15 మధ్యను జారులు 5మిలియను రూబుల్సు మంగోలియాకు బదులిచ్చి బాగుచేసిరి. జపాను, చీనా కూడా తిరిగీ మంచి మాటలతో మంగోలియాను తమలో చేర్చు కొన గోరినవి కాని సాధ్యము కాలేదు.

వెలుపలి మంగోలియాలో చీనా జనరలు హ్సూ అనునతడు 1919 ప్రాంతమున కొంత భయంకరదారుణ పరి పాలనమును ప్రారంభించెను.కాని అంగెర్ను స్టెర్నుబర్గు అను ఒక్క పిచ్చి ప్రభువు(మేడ్‌బారిన్) ఆసమయమున లేచెను.అతడు జెంఘిస్కాను వంశీయుడు. లోపలి, వెలుపలి మంగోలియాలను కలిపి మంగోలియా సామ్రాజ్యముచేసి“ఆసియా వాసులకు ఆసియా” ఉండవలెనని అతను కొంత అలజడి చేసెను,జపాను ఇతనికి చాలాసాయమును కూడా చేసెను. కాని మూడు నెలలు దాటకుండా ఇతని పిచ్చిపరిపాలన మంతమొందెను.