ఈ పుట ఆమోదించబడ్డది

52

చీనా-జపాను

ఇష్టము లేకున్నను,జపాను యేవోకొన్ని సౌకర్యములను చేస్తా నన్నందువలన లిట్టను కమిషనువారు ఈ ఆక్ర మణమున కనుకూలముగానే 1932 లో తీర్పు వ్రాసిరి.చీనా పెద్దగోడ పొడవునను జపాను మిలిటరీ స్టేషనుల ను నిర్మించెను.తరువాత జహోలు, చాహారు రాష్ట్రములను తీసుకొనెను.ఈ విధముగా ఉత్తర చీనాలో జపాను యేటేటా యెంతోకొంత తీసుకొనుచునే యున్నది.జాతిసమితి దీనిని లీగ్‌ ఆఫ్‌ నేషన్సుకాస్త ఆక్షేపించినదను కారణమున జపాను సమితిని తృణీకరించి వెలుపలకు వచ్చి వేసినది.

1933 లో జరిగిన టాంగుకూ ఒడంబడిక ప్రకారము చీనా, మంచూరియాను జపానుకు అర్పించినట్లే. ఈ ఒడంబడిక షరతు లిదివరకు బహిరంగముగా ప్రకటనము కాలేదు.ఇందులో సంతకము పెట్టిన చియాంగు కాయిషేకు జపాను స్నేహము కొరకు చీనానెంతవరకు ధారపోసినాడో తెలియుట కష్టము.లోపల మంగోలియాలో జపాను ప్రవేశించుటకై యెత్తులు పన్నుచున్నది.ఇందుకై మంచూకోకు ఆదేశమునకు మధ్యనున్న 15000 చదరపుమైళ్ళ ప్రదేశము అనగా జెహోలు చాహారు జిల్లాలను జపాను స్వాధీనముచేసుకొనియే యున్నది.