ఈ పుట ఆమోదించబడ్డది

46

చీనా-జపాను
♦♦♦చీనామిాద కన్ను♦♦♦

జపానులో కలిగిన నూతన పాశ్చాత్య జాతీయ చైతన్య మూలకముగా జపాను జనసంఖ్య హెచ్చినది;పరిశ్రమలు పెఱిగినవి; సైన్యములు యుద్ధనావలు వృద్ధియైనవి.జపానువారు నివసించుటకును బాగుపడుటకును క్రొత్తసీమ లు;సరుకులు చెల్లుటకు, ముడిపదార్థములు సంపాదించుటకు వలసరాజ్యములు; సైన్యముల పనికై క్రొత్త అవ కాశములు కావలసియున్నవి.జపాను ప్రక్కనున్న విశాలదేశము, అనేక అవకాశములను పూర్తిచేయు దేశము చీనా యైయున్నది.కనుక జపానుకళ్ళు చీనామిాద పడినవి.


చీనా ఇదివరకే అనేక పాశ్చాత్యప్రభుత్వములకు గుత్తయై యుండెను.చీనాలో కూడా ఇంతోఅంతో జాతీయ విజ్ఞా నము సోవియటు ఆసయములు మొలక లెత్తినవి. కనుక జపాను ఆశలు సఫలము కావలెనన అవతల పాశ్చాత్య ప్రభుత్వములను ఇవతల చీనాప్రజలను డీకొనగల సామర్థ్యము కావలసియున్నది. జపాను తన పారిశ్రామికాభివృద్ధిని సైన్యాభివృద్ధిని కూడ ఇందుకొరకే చేయుచున్నది.

చీనాయొక్క దక్షిణ మధ్యభాగములును పసిఫిక్కుదీవులును ఇదివరకే మంచి నాగరికత పొందియున్నవి. వీనిని లోబరచుకొన్నచో తక్కిన చీనా సులభతరముగా వశ్యముకాగలదు కనుక ఈ భాగములలోనే ముందు ప్రవేశింప వలెనని జపానులో ఒక తెగవారి అభిప్రాయము.ఈ పనికై