ఈ పుట ఆమోదించబడ్డది

28

చీనా-జపాను

10.జపాను సామ్రాజ్య తత్వవిరోధులగు వారందరితోను స్నేహములు చేయవలెను;ముఖ్యముగా జపాను కార్మికులు, కొరియా, ఫార్మోజా మొదలగు దేశముల ప్రజలతో వీరు స్నేహముగా ఉండవలెను. వీరందరికి ఒక్కరీతి శత్రువగు జపానుప్రభుత్వముతో యుద్ధము చేయవలెను.

11.చీనా జాతీయవిముక్తి ప్రయత్నము యెడ సహకారమును చూపు జాతులన్నింటియొక్క సమ్మేళనము నొకదాని నేర్పరచవలెను;మరియు చీనా జపానులకు యుద్ధము సంభవించునెడల యేపక్షమునందును చేరక ఉదార తటస్థభావముతో వర్తింపగల జాతులు ప్రభుత్వములు అన్నింటితోస్నేహసంబంధముల నేర్పరచవలెను.

ఈవిన్నపము జపాను ప్రతికూలపక్షముల వారకందరికిని బాగా నచ్చినది.చీనా ఈశాన్యప్రాంతములందున్న “సంయుక్త జపాను ప్రతికూల సేన” వారు?మంచూరియాలో పితూరీలు రేపి జపానుదేశమును రెచ్చగొట్టుచున్న స్వచ్ఛంద సేవకదళములవారు;క్యూమింగుటాంగు క్రిందనే ఉన్న వేలకొలది కర్షకకార్మిక సైనిక విద్యాధిదళముల వారు ఈ సన్నాహమునకు చేయూత నిచ్చుచున్నారు.షాంఘే, కాంటను, హాంకో, చాంగ్షా, టీన్‌స్టిను, పీపింగు, ఫెంగ్టీను, హార్బన్‌ మొదలగు పారిశ్రామిక నగరములలో జపాను సామ్రాజ్య ప్రతికూలములగు సమ్మెలు లేచుచున్నది.షాంఘే, కాంటను, ఫ్యూచో, స్వాటో మొదలగు నగరములలో డాకులలో పనిచేసేవారు