ఈ పుట ఆమోదించబడ్డది
చీనా

ముట్టడింపబోయెను.దీనితో వారిసేనలు మరీవృద్ధికాజొచ్చెను.కాని చియాంగు కెయిషేకు తనమాట నిలబెట్టు కొనలేదు,ఆత్మహత్య గావించుకొనలేదు.

నాలుగవ యుద్ధము

1932 నుండి చియాంగుకెయి కష్టములినుమడించెను.చీనాలో విప్లవదళములు వృద్ధియగుచుండుటయు తనకు కష్టము లధికమగుచుండుటయే గాక జపానుకూడా చీనాకు ప్రక్కలో బల్లెమై క్రిందను మీదను కూడా పొడవ జొచ్చెను.షాంఘేనగరమును నావలతోను విమానములతోను యెదురుకొనుటయే గాక చీనానుండి మంచూరియా ను విడదీసి దానికి “మంచూకో ” అని ఒక క్రొత్త నామధేయమును పెట్టెను.1911 లో చీనా సామ్రాట్టు పదవి నుండి భ్రష్టుడుగా చేయబడి దిక్కులేక తిరుగుచుండిన హెన్రీపూయిని మంచూకో సామ్రాట్టుగా నొనరించెను. ఈసమయమునందే విదేశప్రభుత్వములు కూడ దక్షిణనగరములపై బాంబులు విసరి అల్లకల్లోల మొనరించు చుండెను.చియాంగుకెయుషేకు అవతల జపాను నెదురుకొనునా,ఇవతల విదేశప్రభుత్వములతో డీకొనునా? రెండును మాని సోవియటు విప్లవులపై తిరిగీ యుద్ధమును అతడుప్రారంభించెను.విదేశ,జపానుప్రభుత్వములతో డీకొనుట కష్టమనియు,చీనావిప్లవులనే చితుకగొట్టవచ్చుననియు అతడూహించి,నాల్గవయుద్ధమును మొదలుపెట్టెను.

19