ఈ పుట ఆమోదించబడ్డది

8

చీనా-జపాను

కాని ఈ విజయము చిరకాలము నిలువలేదు.దక్షిణప్రాంతములలో సన్‌యట్‌సేను క్రమక్రమముగా బలవంతుడై క్యూమిన్‌టాంగును బలపరచి తిరుగుబాటును లేవదీసెను.

ఇంతలో ఐరోపాయుద్ధము వచ్చెను.ఈ యుద్ధములో జపాను పాలుగొనలేదు సరేగదా చీనాసముద్రములో జర్మనీ పడవలను ముంచివేయుచు,జర్మనీరాష్ట్రమగు షాంటాంగును ఆక్రమించుచు చీనాలో పాశ్చాత్య దేశము లనుమించి తన ప్రతిభ నెక్కువగా స్థాపించుకొనజొచ్చెను.జపాను ఈ విధముగా బలవంతమై చీనా ప్రభుత్వము ను తన యురవైయొక్క డిమాండులను అంగీకరిస్తావా అంగీకరించవా అని 1915లో బెదరించెను.ఇందుకు చీనా ఒప్పుకుంటే అనేక పాశ్చాత్యప్రభువులకు బదులు ఒక్క జపాను దాస్యమునకు అంగీకరించినట్లే అగును; కనుక చీనాప్రజలు దీని కంగీకరించలేదు,సరేగదా,అమెరికా సామ్రాజ్యము కూడా దీనిని ప్రతి ఘటించెను. ఏమైనా సరే ఐరోపాయుద్ధానంతరమున 1918 వ సంవత్సరము నాటికి తక్కిన దేశము లన్నింటిని తీసికట్టు చేసి జపాను బలవత్తరమైన శక్తియై చీనాను గడగడలాడించుచుండెను.1919 లో జరిగిన వార్సయిల్సు ఒడంబడిక ప్రకారము షాటాంగు,మంచూరియా,మంగోలియా రాష్ట్రములందు జపాను చేసుకొనిన అక్రమణ ములను ఆదేశములు పూర్తిగా అంగీకరించినవి.