ఈ పుట ఆమోదించబడ్డది

ఉపోద్ఘాతము

చీనాదేశము బహు విశాలమైనది.దాని విస్తీర్ణము 11,000,000 చదరపు మైళ్లు.వైశాల్యములో దీనికన్న కాస్త పెద్దది ఒక రష్యా మాత్రమే.జనసంఖ్యలో దీనికి ఈడైన దేశమే లేదు.చీనాజనాభా 450,000,000 అనగా ఐరోపా దేశాలన్నీ కలిపినా దీనికి సరికావు.ఇంచుమించుగా బ్రిటిషు సామ్రాజ్యమంతా కలసిన యెంత వైశాల్య ము,యెంత జనాభావుండునో ఒక్కచైనాలోనే అంత వైశాల్యము అంత జనాభా వున్నవి.

చీనా సభ్యత,విజ్ఞానము,ఉత్పత్తి,వాణిజ్యము మొదలైనవి నిన్నటివి,నేటివి కావు.5000 సంవత్సరముల క్రింద టనే ఇది అనన్య సామాన్యఖ్యాతి గాంచినది.గ్రంథములు,పాండిత్యము మాట తరువాత చూతము.తుపాకి మందు నావిక దిగ్దర్శని(magnatic compass),కాగితములు,ముద్రణము మొదలగు నవనాగరిక పరికరము లుకూడ ఐరోపీయులకు కంటె కొన్ని వేలయేండ్లు ముందర నుండియే చీనావారికి తెలిసియుండెనట.

ఎన్ని యుండిననేమి,ప్రాచీన విశాల దేశములకెల్ల యెట్టిగతి పట్టినదో చీనాకును అట్టిగతియే పట్టినది.నవనా