ఈ పుటను అచ్చుదిద్దలేదు

దట్టమైన అడవులలో దాక్కుని ఈ భయానకమైన ప్రాణులు భక్తులను భయపెట్టడంలో ఆనందించేవారు యజ్ఞాలు చేసేటప్పుడు వచ్చేవారు, భాండాలని, పుష్పాలని, సమిధలని ఎత్తుకుపోయేవారు. యజ్ఞ సామాగ్రిని మైలపరిచేవారు. రక్తంతో ఆహారాలను ప్రసాదాలను కలుషితం చేసేవారు అన్నారు. తెగలు, జాతుల కలయిక, సంప్రదాయాలు మత పద్దతుల సమ్మిశ్రణంతో కూడిన ఆధునిక హిందూత్వానికి అది శైశవదశ. అప్పుడు మాదిగలు వారి వంతు వారు అనుభవించారు. వారి మాతంగి సంప్రదాయంతో వారు బాగా వెనుకబడిపోయారు. వృత్తి ద్వారా చర్మకారులైన మాదిగలు అస్పృశ్య (పరియా) తెగలలో చిట్టచివరివారయిపోయారు. అయినప్పటికీ ఈనాటి వారి ధార్మిక సామాజిక ఆచార వ్యవహారాలలో వేలాది సంవత్సరాల భారతదేశపు వేళ్ళు కనిపిస్తాయి. కనక క్రైస్తవానికీ, ఈ ప్రాచీన తెగకీ తొలికలయిక చాలా ప్రత్యేకమైనది.