ఈ పుట ఆమోదించబడ్డది

కోకలవీధీ ప్రకరణము.పంచదశమము.

ముత్యాలవీధీ ప్రకరణము.షోడశము.

మ. అతిరమ్యంబగు చెన్నకేశవ గృహంబా చెన్నమల్లీశ్వరా
    యతనంబు పటవీధీవీలకలశోదారాగ్రతంగూడి యా
    దత శోభాఢ్యపురీవధూపృధుకుచద్వంద్వ భ్రమలూర్చుశో
    భితమౌతన్నికటస్ధదీర్ఘికయూఅభీవిభ్రమంబుంగనున్.1

ముత్యాలపేట వీధీ ప్రకరణము.షోడశము

<poem> వ.మఱియు నత్యంత వైచిత్ర్యస్తుత్యంబగు ముత్యాలపేటలో కాళికాభవన పాళికారుచిరంబును మల్లీశ్వర ప్రసా ద మహితంబును దీర్ఘశిలాస్ధగిత దీర్ఘికావర్ఘ్య జలార్ఘ్య ప్రీణితాంతర్ఘ్య స్రేశ్వరంబును నగు పెద్దవీధియు వివిధ విద్రుమ వార్ధుషిక హర్మ్యనుభగంబగు పగడలవీధియు గృష్ణునిగుడివీధియు నట్టపాళేము వీధ్యుఁ వీరపిళ్ళవీధి యుఁ ససంభ్ర మ సరభసభ్రమద్బహులతిలయంత్ర సవిభ్రమభ్రమిా ప్రభవనిర్భరాభ్రతలోత్సర్పదభ్ర ఘటాద భ్రగ్జ రాభ్ర మదఘనారావ ఝూర్ణితంబగు గాండ్లవీధియుఁ గ్రొత్తవీధియుంబట్టుకాశప్ప మోదలి వీధ్యుఁ గప్పల్పోలి సెట్టివీధియుఁ నాగప్ప మొదలిముసైయనందగు నేయికార పొన్నప్పసెట్టి వీధియు సమగ్రవిద్యానిరవ గ్రహంబు ను వివిధద్వజ పరిగ్రహంబు నునై తనగరరాజ కంఠాగ్రహారంబగు కృష్ణప్పనాయని యగ్రహారంబు ను శక్రపురీ సదృశంబగు శక్రసెట్టివీధియుం గట్టకారయారు మొక మొదలివీధియుం గారు జనాకీర్ణంబగు కారకు పేటవీధి యుం బార్కసువీధియు వీరసామి పిళ్ళవీధియు వెంకటమేస్ర్తి వీధియు భేరీవణిగ్జనాస్పందంబులగు తంబు సెట్టి లింగిసెట్టి ముత్తుమారి సెట్టుల వీధులును లబ్బలవీధియుఁ వేశ్యాజనాధికాలో