ఈ పుట ఆమోదించబడ్డది

48

చెన్నపురీ విలాసము

      

   నగ్నితన చిత్రభాను విఖ్యాతి వెలయ
   బహులరూపకృతులు పూని పరగెననఁగ.9

గీ.రైలు రోడ్డునందు రగినందునందుంగం
  బముల కొనల వ్రేలు ఫలకయుగము
  రైలుబండ్లుగదల వ్రేలుచుదిగజాఱు
  వెసదాగమైక పిశునమగుచు.10

వైద్యశాలా ప్రకరణము-తృతీయము.

గీ. ఆపురికి నుత్తరమున వప్రాంతికమున
   సకలలోక హితార్థమా జాతిదొరలు
   ప్రీతి నిలుపఁగ నొక్క యాస్పిటలు వెలయు
   బహు విధామయపీడిత ప్రాప్యమగుచు.1

ఉత్తరశాఖానగర ప్రకరణము-చతుధ౯ము


గీ.చెలఁగు చాకలిపేట సంజీవరాయ
  పేటయును గత్తివాక కాలేటిపేట
  యెరణపురి తిరువట్టూరు మఱియు రాయ
  పురము నలతండియార్పేట పురికుదీచి.1

కాత్యాయనీ ప్రకరణము పంచమము

వ. మఱియు నత్యంత సుకృత కృత్య నిరత్య యసత్య ప్రత్యయంబులై నిత్యాంక నివాసస్తుత్యంబులు నవ్యత్య యాను రూపరూపాభిజాత్య సౌహిత్యంబులు నగుట నావీటికి నపత్యంబులమాడ్కిఁ జూడ్కీ న్వేడ్కబాటించు చుం దీటుకొని గాటంపు నీటుల నాటుకొను నా నాటుపురంబులోన న్మేటియగు కాలేటిపేటలోఁ గారుణ్యంబు నఁ గాణపంగ్వంథాది జనలోకంబులకు