ఈ పుట ఆమోదించబడ్డది

36

చెన్నపురీ విలాసము

లయపవమాన రధ్యాపార్శ్వభాగ సముత్తంభిత రంభాస్తంభ లలితతరతరుణదళ తాళవృంతానిలంబులు పరిభ్రమ జ్జన పరిశ్రాంతి నపనయింప నంతట ప్రతిపౌర నిశాంత ద్వారాతికంబులఁ గాంతర కాంతాజనక రాంతలతాంత తంతన్యమాననీరాజస మంగళంబు లాజంగమ నియంత కంగీకరింపఁజేయుచుఁబురప్రదక్షిణంబు సేయించి మరల మణిసౌంధాంతరాళంబులం బ్రవేశింపజేసి వివిధభోగ ప్రసాద వినియోగంబుల సకల జనులకుం బ్రమోదంబొనఁగూర్చునట్టి యపాథ౯సారధిదేవుని మహూత్సవవైవంబు గనుంగొన్న వారల కిహంబున సకల కళ్యాణ కౌతుకంబులబ్బుటయుంగాక కైవల్యంబు కరగతంబైయుండు మఱియును

      
పృధ్వీవృత్తము.
            ప్రసిద్ధతరబొమ్మ దేవరకులోద్ధనాగాధిపా
            ఖ్యసింధుహరిణాంక వేంకటనృసింహభూపాత్మజా
            ప్రసక్త బిరుదీభద్బహదరూరు ఢక్కాధ్వజ
            ప్రసంజిత బహుప్రధాప్రసృతి భీతవైరి వ్రజా.

గద్యము-ఇదిశ్రీమన్మాల్య నృసింహ ప్రసాద సమాసాదిత సకల శాస్త్ర

సంవిదు పస్కృత సంస్కృతాంధ్ర సాహితీ పురస్కృత సరస

సారస్వత చతుర వాగ్ధోరణి మతుకుమల్లి కులమతల్లికాబ్జ

వల్లికా వయన్మణి కనకాద్రిశాస్త్రి బుధగ్రామణి

తనూభవాగ్రణి నృసింహవిద్వన్మణి ప్రణీతంబైన

చెన్నపురీవిలాసంబను ప్రబంధంబునందుఁ

దృతీయంబగు దక్షిణపద్ధతి

సంపూర్ణము.