పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/97

ఈ పుట ఆమోదించబడ్డది

మద్యనిషేధం అవసరమే!

101

చాలా పరిశ్రమపడి యెంతో దూరాన్నుంచి వచ్చావు. కొంచెం యీ మద్యాన్ని దాహం పుచ్చుకుని మటీ వెడుదువుగాని" అంటూ ఆతిథ్యానికి ఆహ్వానించేటప్పటికి మనవిరాగి“అబ్బే! యీ పని పంచమహాపాతకాలలో హిందువులు చేర్చి నిషేధించి వున్నారు, మహమ్మదీయులుకూడా దీన్ని చాలా తప్పపనిగానే చెప్పి దూషించారు. కాcబట్టి యీపని నేను చేసేదిలే" దనేటప్పటికి - "ఆపద్ధతిని యీ మార్గాన్ని వెళ్లడానికి అవకాశం లే" దని ఆ పురుషుడు “ఖజేరావు’ చెప్పడంతొటే మన పరమార్థవేది అనుకున్నాండు గదా! యేమనంటే? “వున్న మార్గాలేమో నాలుగే కనపడతాయి. నాలుగింటిలోనూ నాలుగు ప్రతిబంధకాలూ సిద్ధమయినాయి. వీట్లల్లో సూలసూక్ష్మాలు విచారిస్తే కొంత వీలుగావున్నది కల్లపుచ్చుకోవడమే. యేమంటే? యిందులో హింసాదోషంలేదు. యిది వొకచెట్టునుంచి పుట్టేది. పూర్వులయితే దీన్ని కూడా నిషేధించారుగాని నిషేధించినా దీన్ని అంగీకరించడంలో గుడ్డిలోమెల్లగా వుండడంచేత అట్టేతప్పగాతోంచదు. అంగీకరించని పక్షాన్ని మోక్షానికి వెళ్లడానికి యింకోతోవ కనపడడమే లేదుగదా!" అని చర్చించి యెట్టకేలకు మనస్సు సమాధానపఱచుకొని ఆమద్యాన్ని సేవించడంతోటట్టుగానే అంతకుముందు వుండే విజ్ఞానం యొక్కడికో పటాపంచలై పాతిపోయింది. దానితో వెనకచూచిన మేంకపోతును చంపి మాంసభక్షణ చేయవలసివచ్చింది. దానితో "తాటితో దబ్బనం"గా ఆ సర్వాంగసుందరి అవసరం అయింది. పిమ్మట ఆవిడతో జూదం ఆడడంకూడా అవసరమయింది. తుట్టతుదకి “నీవిమోక్షోహిమోక్ష" అనేవాక్యానికి ప్రథమోదాహరణంగా మన ముముక్షువు పరిణమించాండు. మహమ్మదీయులలో ప్రాజ్ఞలవల్ల విన్న యీ యితిహాసం వల్ల తేలిన సారాంశం - అన్ని దుర్వ్యసనాలకున్నూ మూలకందం సురాపానమే అని స్పష్టమయింది. కాcబట్టి పానం వర్ణించడం మహమ్మదీయులక్కూడా అంగీకారమే. యూరోపియన్లుకూడా దీన్ని వర్ణించేవిషయంలో అడ్డుతగలరు కాని వారిదేశంలోవుండే శీతోష్ణస్థితినిబట్టి మితంగా దీన్ని అంగీకరించవలసిందంటారు. కాని కొలఁదికాలంకిందట అమెరికాలోకూడా యీ మద్యపానాన్ని పూర్తిగా నిషేధించడానికి ఆరంభించారు. కృతకృత్యత్వాన్ని కూడా పొందడమైతే జరిగిందంట గాని మళ్లా ప్రారంభించినట్టు తెలుస్తూవుంది. ఆ ఖండంవారికిన్నీ మనకిన్నీ వుండే భేదం యేమిటంటే? మన ఆర్యులు యెంతో ఆలోచించి కాని యే విధినిన్నీయే నిషేధాన్నిన్నీ అమల్లో పెట్టరు. పెట్టితే అది యుగాలకొలఁది నిల్చిపోవలసిందే కాని మళ్లా వెంటనే నాటొడ్డుకుతూ అంటూ మాఱడం అంటూవుండదు. మనవారు విధించే కార్యాలకున్నూ పుణ్యానికిన్నీ లంకిసా ఆలాగేవుంటుంది. నిషేధానికిన్నీ పాపానికిన్నీ లంకిసా వుండి తీరుతుంది. యీ విషయంలో మహమ్మదీయులుకూడా మన మార్గాన్నే చాలా వఱకు అనుకరిస్తారు, కాని మనం పాపమనుకొనే కార్యాలు చాలా వఱకు వారికి