పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/95

ఈ పుట ఆమోదించబడ్డది

గర్భాధానం

99


వ్రాయడము తటస్థించింది. శాబ్దబోధోపకరణాలలో లాక్షణికులు వుదాహరించిన సామగ్రిలో వ్యవహారమే అగ్రస్థానాన్ని వహిస్తుందంటే వొప్పనివారుండరు. యిలా వ్రాయవలసివస్తే యెన్నో పదాలకు వ్రాయవలసి వుంటుంది. దీన్ని వుపలక్షణంగా పెట్టుకొని తక్కినవాటిని గ్రహిస్తారని ప్రస్తుతం దీనితో ముగిస్తూ యీవక్కమాటా వ్రాస్తాను. గర్భాధానం యెత్తిన అవతారాలు యెన్నో వున్నా అందులో మిక్కిలీ మృదువైనదిన్నీ ఆంధ్రదేశంలో చాలా వాడుకలో వున్నదిన్నీ శోభనమనే అవతారమే కనక దాన్ని వదలుకోకూడదని భావికవులను హెచ్చరిస్తూన్నాను. దీనికి మహాకవి ప్రయోగంకూడా ఉందని శ్రీగిడుగు వారనంగా విన్నాను. కాని దీనికి ప్రయోగంతో కూడా అవసరమే లేదని నా తాత్పర్యం. కృష్ణా డిస్ట్రిక్టులో కార్యమనికూడా అనడం కలదు. బహుశః యీ కార్యం గుంటూరు డిస్టిక్టులోనున్నూ వ్యవహరించేదే కావచ్చును! యింకా దీన్ని గూర్చి చర్చిస్తే మటికొన్ని యిలాటివే దొరికితే దొరుకుతాయేమో కాని వీటికన్నిటికిన్నీ శిరోమణి శోభనపదమే. యీ శోభనపదము సర్వశుభక్షార్యములకున్నూ వాచకమే అయిననూ ప్రస్తుతాన్ని విశేషించి చెప్పడం యోగరూఢిచేతనని విజ్ఞలకు తెలప నక్కఱలేదు. పంకజపదము అవయవార్ధమును పుచ్చుకొనే పక్షంలో నత్తగుల్లకుకూడా వాచకం కావలసి వున్ననూ రూఢిని పురస్కరించుకొని పద్మమాత్రమందు శక్తమయినట్లే అని వ్రాయనక్కరలేదు గదా? వ్యాసం విస్తరిస్తూవుంది. గర్భాధానపదం మోటుతనంగావుందని తోcచకపోతే దాన్నే వాడుకోండి, ಟ್ು “శోభన"పదాన్నే వాడుకోండి. అసలు నిఘంటులలో భుక్తికి, నిద్రకు కొన్ని ಮೆಳ್ತಲ್ಲಿನ್ಸ್ಯು. గాని దీనికిమాత్రం లేవు. యభనం వగయిరాలు వున్నాయంటారా? అవి బూతులలో చేరతాయి. అందుచేత శోభనమే ఆధారం. దీన్ని వదలుకోవడమనేది నేల విడిచిన సామువంటిదని మనవిజేస్తూ ముగిస్తున్నాను.

  • * *