పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/92

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


శేషహామంతో పరిసమాప్తి పొందిన అగ్నిహోత్రాన్ని మళ్లా సంధానం చేస్తూన్నాను అని. కనుక ఆ పదంతో అంటే "పునస్సంధాన" పదంతో వ్యవహరించవలసి వచ్చిందను కుంటాను. యీ అర్ధాన్ని నేను కొందఱు సంప్రదాయవేత్తలైన పండితులు వున్న సభలో వుపన్యసించి వున్నాను వారు సమ్మతించినట్లే తోచింది. కాని ఆ పండితులకు, శిరోమణి అని కాని “ఉరోమణి" అని కాని బిరుదాలు లేక డిగ్రీలు వున్నట్టు లేదు. పూర్వపు రకంగా వేద, వేదాంగాలు అభ్యసించి యునేక తరవాయులు శిష్యులకు చెప్పిన మహామహులు. యిప్పడు ఆ పండితులకు అంతగా గణ్యత కనపడదు. చూడండీ“అమవసనిసి యన్నమాట" అనే సందర్భంలో యీమధ్య వక శిరోమణిగారు ఆలంకారిక సమయాలెన్నో చూపివున్నారు. పైగా బ్రహ్మదేవుడికి లక్ష్మీగర్భవాసత్వాన్ని కూడా ఆ సందర్భంలో ఆపాదించారు. ముఖ్యంగా నాకు ఆలాటివారి పాండిత్యమంటే భయంవేస్తుంది. వారిని తలపెట్టకపోయినా కలగచేసుకొని యేదో వారు వ్రాయకమానరు. కాబట్టి మంగళార్థంగా వారిని కొంచెం స్మరించి వ్రాసుకొనేది వ్రాసుకోవడమే యుక్తమనుకొని ఆలా స్మరించి ప్రస్తుతాన్ని వుపక్రమిస్తాను. “ఔపాసన" పదంవంటిదే పదమున్నూ కాని కొంచెం శంకకస్థూత్రం అవకాశం లేకపోలేదు. పెండ్లికొడుకు గర్భాధానకాలం వఱకున్నూ జీవత్పితృకుండుగా వుంటే యీలోంగా అగ్నిహోత్రంతో ప్రసక్తివుండదుగాని అన్యథా ෂඨි పద్ధతిని తండ్రి తద్దినం లేక తల్లి తద్దినం తటస్థించినప్పుడు సమంత్రకంగా పెట్టేఎడల అగ్నిహోత్రంతో సంబంధంతప్పదు. అప్పడు ఈ శుభకార్యానికి వాడే "పునస్సంధాని" పదం ఆబ్దికానిక్కూడా వాడవలసివస్తుందేమో? అని శంకయితే ఇప్పడు నాకే కలిగిందిగాని లోకంలో గర్భాధానానికే కాని ఆబ్దికానికి అట్టివాడుక లేకపోవడంచేత అదిప్రస్తుతానికి బాధకంగాదు. అన్నిటికంటే వ్యవహారం ప్రబలమని ముందు తేలుతుంది. కాబట్టి విస్తరించేదిలేదు. దీని కోసం యితరోదాహరణాలు చూపవలసివస్తే అమరమూ, దాని వ్యాఖ్యానమూ పూర్తిగా వుదాహరించవలసివస్తుంది కనక స్పృశించి వొదులుతూ వున్నాను. యిప్పటికి, గర్భాధానం, ఔపాసనగానున్నూ పునస్సంధానంగానున్నూ కొన్నాళ్లకు లాక్షణికపదంగా మాటినట్లయింది. గద్వాల ప్రాంతంలో యీ పదాలతో యీ మహోత్సవాన్ని వాడుతూవున్నట్లులేదు. వారు “ప్రయోజనం" అనేమాటతో వాడుతూ వున్నారు. మేము હૈં ఆత్మకూరి ఠాజుగారికి కృతిగా ఆంద్రీకరించిన శ్రీనివాసవిలాసంలో మంగళ పద్యంలో-

“తన పునస్సంధానకాలమ్మనన్"

అని వాడేటప్పటికి ఆ సంస్థానపండితులు, పునస్సంధానమంటే యేమిటి? అనడానికి ఆరంభించారు. మేము “యిదేమిటండీ యీమాటకే అర్థం తెలియదా?” అని