పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/88

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


వామాచార వైష్ణవమతంలో చనిపోయినవాళ్ల దినవారం తుట్టతుదను చాత్తాని వైష్ణవులున్నూ చనిపోయిన వ్యక్తితాలూకు బంధుమిత్రులున్నూ యధేష్టంగా మద్యాన్ని సేవించడం యిప్పటికిన్నీ ఆచారంగా జరుగుతూ వుంది. దీనిపేరే “తొళ్లకం" అంటారు. దీనిపేరునుబట్టి విచారిస్తే యీ ఆచారము అఱవదేశం బాపతని తేలుతుంది. దీన్నిబట్టి యిది దుర్వారమైన దుఃఖాన్నికూడా పోఁగొట్టే శక్తికలదని యేదో వకమతం వారు భావించడం కనపడుతూ వుందిగదా! అయినా సేవించిన ಪಿಮ್ಮಿಟು దీనివల్ల కలిగే చెడుగులు ఎక్కువగా వుండడంవల్ల దీన్ని సేవించిన వాఁడు పంచమహాపాతకులలో వకండుగా పరిగణింపCబడ్డాండు. పాతకం మాటకేంగాని ప్రత్యక్షంలో యీపానం సంసారికి అన్ని యీతిబాధల కన్నా యొక్కువ యీతిబాధగా కనబడుతుంది. యిట్టి పాతకకార్యాలు చేయించేవి గాకపోయినా సిగరెట్లు వగయిరా లోcగడ నేను వుదాహరించినవన్నీ యీతిబాధలనడానికి సంశయంలేదు. ఇవి అనాదిగా అపరిహార్యాలుగావున్న యీతిబాధలేమో అంటే, ఆలాటివికావు. యితరదేశ సంపర్కంవల్ల మనదేశానికి రవాణా అయి యీ దేశాన్ని ఆరోగ్యాన్నీ భంగపఱిచి యితరదేశాన్ని పోషించడానికి వుపయోగ పడుతూ వున్నాయి. కనక సంస్కర్తలకు భగవంతుండు తోడ్పడి యీదేశ కల్యాణాన్ని సంపాదిస్తే యెందటోగృహస్టులు సంతోషిస్తారు. అమితవ్యయం తగ్గుతుంది. ధనాఢ్యులు వీట్ల నిషేధానికి తోడ్పడరు కాCబట్టి దీనివల్ల వచ్చే ముప్పసామాన్యులకు ఏలాగా తప్పదు. దీనికి వక విధమైననైతికశక్తి సామాన్య గృహస్టులలో అంకురించడమే వుపాయం. అట్టి మహాభాగ్యం సామాన్య గృహస్టులకుకూడా సర్వేసర్వత్ర కలగడమనేది చిత్తశాంతివల్లనే గాని అన్యథాగా కలగదు. అట్టి చిత్తశాంతి కలిగేయొడల యీ "కల్పనారుచు"ల యందుండే వ్యామోహం తగ్గుతుంది. కాని అదిచాలా దుర్ఘటం. దానికై పత్రికలున్నూ వుపన్యాసకులున్నూ శాయశక్తులా ప్రయత్నించవలసి వుంటుంది. యీ అభిప్రాయము నాకిప్పుడు కలిగింది మాత్రమే కాదు; యిప్పటికి సుమారు నలభైయేళ్లనాండే కలిగింది. దాన్ని మా మొట్టమొదటి కామేశ్వరీశతకంలో వుదాహరించి కూడా వున్నాను. ఆ పద్యాన్ని యిక్కడ వుటకించి దీన్ని ముగిస్తాను మ. “అనుమానింపక కల్పనారుచులపై నాసల్ పిసాళించునె మ్మనముం ద్రిప్పఁగలేక దుర్విషయముల్ మన్నించుచున్సాధు స జ్జనసాంగత్యము వీడినట్టి పరమాజ్ఞాని ననున్ శుద్ద వ so ఇ+ ெ ర్తనకుం దార్చిన నీకృపారస మపారం బంబ! కామేశ్వరీ!"

★ ★ ★