పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/85

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొత్తరకం ఈతి బాధలు

89


మాదిరిగా ప్రతి సామాన్య గృహస్టుకున్నూ వున్నదంతా తుడిచిపెడుతూ వుందనడంలో అతిశయోక్తి లేశమున్నూ కనపడదు. యిది సామాన్య గృహస్టులకు మాత్రమేకాదు; పెద్దపెద్ద సంపన్న గృహస్టులకు కూడా నానావిధాల యీతిబాధ. బాగా ఆర్జించి నిలవచేసిన ప్లీడర్లు వగయిరాల కొడుకులు యొక్కడోగాని మళ్లా తండ్రులమాదిరిని వుద్యోగాదికం చేసి సభ్యత్వాన్ని సంపాదించడం కష్టం. ఆలాటివాళ్లు తండ్రితాతలు సంపాదించిన ద్రవ్యంతో యూ సినిమా “ఫిల్మలు" తయారుచేయించడానికి పూనుకొని 'యెనీమా వల్ల వచ్చేఫలితాన్ని పొందుతూవున్నట్టు వింటున్నాను. అది వర్తకం కనక దానిలో లాభమూ వకప్పడు రావచ్చు, నష్టమూ రావచ్చుననుకొందాం. యితర గృహస్టుల తాలూకు ఆండవాళ్లు యీ ప్రదర్శనాలకు వేలంవెట్టిగా యెగబడడం యేలాటి యీతిబాధో, ప్రతివారికిన్నీ అనుభూతమే కనక విస్తరించి వ్రాయనక్కఱలేదు. యింటిల్లిపాదీ తలుపు తాళంవేసి ఆండాళూ మొగాళూ పసిపిల్ల దేఖీలు సినిమా మహోత్సవానికి వెళ్లడం కనిపెట్టి యిదేసందనిచెప్పి దొంగలు కొంప ‘అయ్యవార్లంగారి నట్టిల్లు చేయడంవల్ల కలిగే హాన్నికూడా గణించనివా రెందటో గృహస్టులు కనపడతారు. కాంగ్రెసు మంత్రులు మద్యనిషేధాన్ని గూర్చి ముందుగా ప్రయత్నిస్తూ వున్నారుగాని అంతకంటే మున్ముందుగా-“ఆదౌ పూజ్యోగణాధిపః" అని సినిమా నిషేధానికి వుపక్రమించడం అవసరమని నాకు తోcచింది. యీ సినిమా సంబంధమైన టిక్కట్లు అంతగా ధనవ్యయాన్ని కలిగించేటట్టు లేదుగాని దీన్నిమిత్తం రాకపోకలకు బళ్లు వగయిరాలు సెట్టిసేరు, లింగం సవాసేరు' అనే లోకోక్తి స్మారకాలుగా కనపడతాయి. స్త్రీలకేమి? పురుషులకేమి? యీ సినిమాలవల్ల అలవడేదుర్నీతి విశేషంగా కనపడుతుంది. కొందఱు యీకథాభాగాలు, సంస్కరించాలనే వారున్నట్టు పత్రికల్లో వుండే రాంతలవల్ల గోచరిస్తుందికాని కల్లుదుకాణాలను సంస్కరించడం యేలాటిదో యిదిన్నీ ఆలాటిదే అనుకుంటాను. యీ బాపతు యితివృత్తాలు కొన్ని పురాణ ప్రసిద్ధాలు లేకపోలేదు. గాని అందులో మధ్యమధ్య నేcటివారు కల్పించిచేర్చేవి యెన్నో దుర్నీతి ప్రధానంగానే వుంటాయి. యెప్పుడో స్త్రీ స్వాతంత్ర్యం రావాలనీ, వస్తుందనీ కొందఱు వుఱూంతలూగుతూ అనుకుంటూ వున్నారుగాని నేను పట్నవాసాల్లో కించిన్న్యూనంగానున్నూ పల్లెటూళ్లలో చాలా న్యూనంగానున్నూ అది యిప్పటికీ వచ్చిందని తలుస్తాను. యెన్నో దుర్వ్యసనాలతో నిండివున్నయీ ప్రపంచాన్ని సంస్కరించడం అంటే, "యెలుంగొడ్డు తంటసప్పని” గానే కనపడుతూవుంది. అట్లని వుపేక్షించడం సంస్కర్తల ధర్మంకాదు. శాయశక్తులా ప్రయత్నించక తప్పదు. యీ దుర్గోషాలన్నీ జ్ఞానంవల్లనే కాని నివర్తించవు. ఆ జ్ఞానం విద్యవల్లతప్ప లభించదు. ఆ విద్యకూడా యీ కాలంలో అనేక యీతిబాధలతో మిళితమై వుండడంచేత యేలా ప్రపంచానికి శ్రేయస్సు కలుగుతుందో? యెన్ని విధాల ఆలోచించినా, ఆలోచనే ^