పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/823

ఈ పుట ఆమోదించబడ్డది

“ఊరిపిడుగు వీరి సెట్టిని కొట్టుకు పోయింది"

927


వదలినాను. ఇతరుల వాదాన్ని కూడా ఖండించాను. ఖండించలేనివి వదలినాను. ఒక్క నాగభూషణంగారి వ్యాసంలోవున్న రెండుమూఁడు యెత్తిపొడుపు మాటలు మాత్రం నావద్ద వ్యాసం వ్రాసేటప్పుడు పత్రిక లేకపోవడంచేత యెప్పుడో చూచిన జ్ఞాపకాన్ని బట్టి వ్రాయవలసివచ్చింది కనక నేను గమనించలేదు. ఆమాటల విషయంలో గురువుగారు చూపినసవరణను నేనువప్పుకుంటాను. తక్కిన “చాకలిచే" మహాపండితునికి జవాబు చెప్పించడంలోనైన ప్రసంగం గురువుగా రెన్నటికీ సమర్థించేదికాదు. అది అలా వుంచుదాం. శాంతివ్యాసానికి సుమారు ఆఱుమాసాలకాలంలో పెండేరపు సభ జరిగింది. గురువుగారు యిప్పుడేలా వ్రాస్తూవున్నప్పటికీ, అప్పుడు వెంll శాII గురువుగారికేవిధమైన అపచారమున్నూ చేయలేదు అని వారి అంతరాత్మకేకాదు ఆ సభయావత్తుకూ తెలుస్తుంది. కోపం వచ్చినప్పుడు కూడా నిజం నిజంగానున్నూ, అసత్యం అసత్యంగానున్నూ వప్పుకొనేవారితో వివాదు వచ్చినను చిక్కుండదుగాని అగ్రహానుగ్రహాలను బట్టి “యేయెండ కాగొడుగుగా” వాగ్ధోరణి మాఱేవారితో వాదోపవాదాలువస్తే చాలాచిక్కు! యీ చిక్కు కేమి! మేము ఆ ఆత్మను వంచించిచెప్పే మాటలేవో ? వంచించ కుండా చెప్పే మాటలేవో? లోకం యేలాగా గ్రహిస్తుంది. దానికోసం శ్రమపడనక్కరలేదు. యిఁక ప్రస్తుతమేమిటంటే? యెవరో తెచ్చిపెట్టారంటూ వారిని దూషించడం అంత అవసరం కాదు. గురువులు వారికి వ్రాసిన వుత్తరం వగయిరా (అచ్చుపడ్డ) రికార్డు నాకు పంపినమాట వాస్తవం. అదినాకోరికనుబట్టి జరిగింది. గురువుగారి యేకలవ్య శిష్యునికిన్నీ యీ రికార్డు పంపినవారికిన్నీ నా శిష్యత్వాన్ని గుఱించి కొంత ఘర్షణ జరిగినట్లు అక్కడ అచ్చుపడ్డపత్రికలే చెపుతాయి. ఆకారణంచేత ఆ యేకలవ్యశిష్యునికిన్నీ ఆయనకున్నూ స్పర్ధయేర్పడిందే అనుకుందాం. మాలో గురుశిష్యులకు జరిగేవాదోపవాదాలవల్ల ఆ యేకలవ్య శిష్యునికేమి భంగం వుంది? ఆయనకేమేనా నా ద్వారాగా భంగం కలిగినప్పుడు కదా, ఆయన ప్రతికక్షిదారుఁడు సంతోషించవలసివస్తుంది. అట్టిది లేశమున్నూలేదే? లోకులు మా యిద్దరినోలేక మాలోవకరినో భూషించడమో! దూషించడమో జరుగుతుంది. అంతేకాని ఆయేకలవ్య శిష్యుఁడికి దీనిలో వచ్చిన నష్టమేముంది? ఆయనవిన్నమాట లాయన యేకరు పెట్టివుండును. అంతే. అందువున్న సత్యాసత్య విచారంతో ఆయనకేం పని! గురువుగారు అసత్యంచెప్పినారని ఆయనయేలా అనుకుంటారు! అందుచేత ఆయన్నియేమోచేయడానికి నేనుయిందు పూనుకోలేదు. నా విద్యాభ్యాసమెట్లు జరిగిందో ఆ సందర్భం యితరత్రా వ్రాసివుండడంచేత దానికి విరోధించే వ్రాఁత గురువులది బయలుదేరడంవల్ల నే నీ వ్రాఁతలకు దిగవలసివచ్చింది. నిజమిట్టిదైవుండఁగా, తమకూ యేకలవ్యశిష్యుఁడికీ యేమోఅపకారం జరిగించడానికి ఆయనశత్రువు శాలువలూ కఱ్ఱాయిచ్చి యీ వివాదాన్ని