పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/814

ఈ పుట ఆమోదించబడ్డది

918

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


తోఁచి యిలా వ్రాసి వున్నారు. అలావ్రాస్తే బళ్లని తోలాలిగదా? అంత పెద్దమేటరును యేపత్రిక భరిస్తుంది! భరించని పద్ధతిని నేను వ్రాసినా ప్రయోజనం లేదుగదా. యిదిన్నీ కాక లోకం గురువులు కోపంమీఁద యేదోరీతిని తిడుతూవుంటే ఆ తిట్లకు జబాబు పెట్టుకొనేటంత మూర్ఖుణ్ణిగా నన్ను తలుస్తుందనుకోను. చూపితే ఆతిట్లు చూపాలని మాత్రం వుంది. అదిన్నీ అవసరం లేదు. యిదివఱలో పత్రికలో లోకులు చదివినదే కదా? గురువువారి ధోరణిని గూర్చి యిదమిత్థమని నేను నిర్ణయించుకోఁజాలకున్నాను. వక విషయం చూడండి.

విశ్వకర్మశిష్యుఁడుగారిని అభినందించవలసి వచ్చింది గురువు గారికి, యెందుచేత? ఆయన గురువుగారి చరిత్ర హరికథగా వ్రాస్తూ దానిలో పట్టిసంభద్రకాళమ్మ ప్రత్యక్షమై (కలలోఁ గాదుసుఁడీ) నట్టూ పాణినీయాన్ని కష్టపడి చదువకుండా "పాడినట్టూ" యీ వగయిరాలు వ్రాసి ఆనందం కలిగించడమే కాక హైదరాబాదు ద్వారాగా యీతగాదా తెచ్చినప్పటికీ యిటీవల “నరంలేనినాలుకను" యేలాపడితే ఆలాత్రిప్పి తమకనుకూలించే లాగ పనిచేస్తూ వున్నారు. అందుచేత ఆయన్నియెక్కువగా అభినందించవలసి వచ్చింది. “ప్రజాసేవా" పత్రికలో వక కాలం కాలానికి దానికింద వినియోగించారు. వారికన్న నాకన్న ఆయన చాలా గొప్పవారనీ యోగ్యులనీ యేమేమో వ్రాశారు. అంతతో తృప్తితీరింది కాదు. ఆ పట్లాన్ని యెప్పుడో నావద్ద పుస్తకం పట్టిన బ్రాహ్మణ శిష్యబృందాన్ని యెత్తుకొని యీ క్రింది మాటలు వ్రాశారు. చదువరుల వినోదార్థం వాట్లను మాత్రం యిక్కడ చూపుతాను.

"మీ బ్రాహ్మణశిష్య బృందములో యెవ్వరును వానింబోలిన సుస్వభావముకలవారు లేరని డంకామీఁద దెబ్బకొట్టి నేను చెప్పఁగలను."

అసలు యీ విశ్వకర్మ శిష్య ప్రశంసాధ్యాయం గురువుగారెందుకుపక్రమించవలసి వచ్చిందంటే? హైదరాబాదులో “విశ్వకర్మ శిష్యుఁడు” నా ప్రశంస తెచ్చెనఁట అని నేను వ్రాయడం వల్ల అది పరిహాసమఁట. అందుచేత నీకు “వడ్డి శిష్యుఁ" డున్నాడంటూ యెత్తిపొడిచారు. నేనేమైనా విశ్వకర్మ శిష్యుఁడుండడంతప్పంటే అది కోపకారణం కావచ్చును. నాకున్నూ విశ్వకర్మ శిష్యులు చాలామందికలరు. యిందులో యింకోచిక్కు వడ్డెకులస్థులు మేమే అంత తక్కువా? అని ప్రశ్నించడాని కారంభించారు నన్ను యెప్పుడనుకున్నారు? మంచిది అసమయంలో భార్యాదశాహంనాఁడు. “దానిలో అంతదురర్థంలేదు. మా గురువుగారు నన్నంటే నేను- కోపగించుకున్నానా?" అంటూ చెపితే వారి కెక్కుతుందా అది? మీరూ మీరూ, యిప్పుడెందుకో వివాదపడుతూవున్నా బ్రాహ్మలే కనక సర్ది చెపుతూవున్నారన్నట్లు వారిథోరణి కనపడింది. యిప్పుడెవఁడుగానేని పుట్టి కాలంగడుపుకో