పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/812

ఈ పుట ఆమోదించబడ్డది

916

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


భేదాన్ని మామావంశవర్ణనా పద్యాలను బట్టి క్షణంలో లోకం గ్రహిస్తుందనుకుంటాను. మా పూర్వులు దివాన్‌జీ పనిచేసినట్లెక్కడా నేను వ్రాయలేదు. యజ్ఞయాగాదులున్నూ చేసినట్లు వ్రాయలేదు. యిట్టిస్థితిలో మా ముత్తాతగారు యజ్ఞయాగాదులు చేసినట్లు జనరల్‌గా వ్రాసి యున్నారు. అది నిజమే అయితే వకరికైనా సోమయాజి బిరుదంవుండదా? అని నేను ఆత్రోవ విడిచిపెట్టాను. అట్టి శుద్ధశ్రోత్రియ కుటుంబం మాదనిగాని కొంతేనా లౌకికోద్యోగం చేసిన కుటుంబం మాదని గాని వ్రాసుకోవడం సిగ్గుచేటని నాకు తెలిసి సత్యవాక్తత్పరత్వమున్నూ అంతో యింతో కవిత్వము చెప్పడమున్నూ మాత్రమే మావంశమందున్నట్టు సూచించివున్నాను. నా “బాలసరస్వతీ” బిరుదధారణాన్నిబట్టి గురువుగారు శాసించినట్లు "శ్మశాన వృక్ష"మై పుట్టడం తటస్థింపక మనుష్య జన్మమే వచ్చేయెడల మళ్లా యీలాటి వంశంలోనే జన్మాన్ని అనుగ్రహించవలసిందని భగవంతుణ్ణి ప్రార్ధిస్తాను అశ్వమేధాదులు చేసిన వాళ్లకంటే కూడా సత్యవాక్యతత్పరులే పూజ్యులని భారతంలో వుంది. అదే నాకు కావలసింది. యెన్నో వుక్రోశపు వ్రాఁతలు వ్రాశారు గురువుగారు. వాట్లన్నిటికీ జవాబెందుకు? శతావధానం సంపూర్తిగా యొక్కడా చేయలేదన్నారు. తి.శా. గారున్నూ నీవున్నూ సాయంపట్టేవా రన్నారు. యిద్దఱు చేయడమే చాలాకష్టతరం అని యెందఱో ప్రాజ్ఞులనుకొనేవారు. పైఁగా నీవుచేసే అవధానాన్ని చేయలేనివారెవరు. అందఱూ చేస్తారన్నారు. అంటే యేమన్నమాట? ఆహారవిహారాలవలె అవధానంకూడా సర్వసామాన్యమే అన్నమాట. కోపంమీఁద వ్రాసేమాటలకు అర్థమేముంటుంది? నేను వకణ్ణే సంపూర్తిగా నూజవీటిలో సంపూర్ణ శతావధానం చేసిన సంగతి గురువుగారు యెఱుఁగ రనుకుంటాను. యెఱక్కేమి? యెఱిఁగే వుంటారు. వారు అవధానులు అగుదురా? కారా? అన్న సంశయాన్ని లోకానికి తొలఁగించడాని కాలా వ్రాశారనుకుంటాను. ప్రభాకరశాస్త్రికి సంబంధించినదాన్ని కొంచెం వ్రాస్తాను. గురువుగారు, తిరుపతిశాస్త్రిగారు ప్రభాకరశాస్త్రిని తమవద్దకు పంపుతూ, "వెం||శా|| మీ వద్ద మూఁడుమాసాలు మాత్రమే చదివినట్లు వ్రాసి చేవ్రాలుచేసి యిమ్మన్నట్లున్నూ, తమరు, తి|| శా|| గారివద్దనుండి వక వుత్తరం యీ అర్థమిచ్చేది చేవ్రాలుతో తెస్తే “వెంll శా|| నా వద్ద అసలు చదువనే లేదని వ్రాసి చేవ్రాలుచేసి యిస్"తానని జవాబు చెప్పినట్లున్నూ చెరలాటంలో వ్రాశారు. దీన్నిబట్టి గురువులకోపం బాగా తెలుస్తుందికదా. దీని నిజానిజాలను దేవుఁడే యెఱుఁగునని నేనింత వఱకు సృశించనేలేదు. తి||శా|| స్వర్గతుఁడయ్యె ప్రభాకరశాస్త్రికేదేనా. అవసరం వచ్చి కార్డు వ్రాస్తే జవాబే వ్రాయడం లేదాయె, అట్టి స్థితిలో దీన్ని సృశిస్తే మాత్రం యేం లాభం? అదిన్నీ కాక గురువుగారు వ్రాసే అబద్ధాలలో