పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/806

ఈ పుట ఆమోదించబడ్డది

910

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


మీద యెక్కించి వూరేగింపఁబడిన వైభవములు వేయిన్నూటపదియార్లను గూడ నొసగి సమ్మానించిన వారిని గూడ ఠీవితోనే ఆశీర్వదించిన వైఖర్లును ఎవరెరుగని సంగతులని? గురువుగారి కెవరో పది రూపాయిలను ముట్ట జెప్పమన్నటుల తెలిసి వారి కెందుకు దక్కవలె మనమే తెచ్చుకొందామని ప్రయత్నించినటుల యెవరేనా శిలాశాసనము వ్రాసి పెట్టినను, విశ్వసించుటకు లోకమేమంత మాత్రము మూర్ఖత చెందినదా? మీరు జయాపజయముల కొఱకనుకొనుచున్నారే కాని లోకంమాత్రం యిద్దరు పెద్దవారైనారనే అనుకొనుచున్నారు. నేనంటే యీలాంటి వెర్రిమొర్రి వ్రాతలు వ్రాస్తూ వుండడమలవాటేనని మీకు బాగా తెలిసిన విషయమే గనుకను, వినదగిన విషయము లేమేనా వుంటే వినిపించ వచ్చుననియు, తప్పయితే క్షమింతురని ధైర్యంతో యీ విషయ మింతదూరం వ్రాయడమైనది.... చేవ్రాలు.

ఆయీ విమర్శకులు వుత్తరం 22-3-36 తేదీగలది. అప్పటికి యింకా గురువుగారు ముప్పది రెండు దోషాలు ఆరోపించిన కృష్ణ ఆయన చూడలేదు పాపము. శృంఖలానికే అంత నొచ్చుకొన్న ఆ విమర్శకులు “గురుతల్ప" దోషములోనగు మహాపాపముల నాపాదించిన గురువుగారి లేఖిని నెంత మెచ్చుకొనునోకదా? అయితే యీ విమర్శకులెవరో? యేవూరివారో! అధికారమెట్టిదో? లేశమున్నూ నేనిట వెలిపుచ్చలేదు. ఆయన నాకన్న చిన్నయైనను ఆయన నన్ను గూర్చి యొనర్చిన సదుపదేశమును నేను శిరసావహిస్తూ వున్నాను గాని మా గురువరులట్లు శిరసా వహిస్తారో? లేదో? వీలైనంతలో యిరువురకును అనుకూల్య ప్రాతికూల్యములు సమంగానే వుండాలని యీయన ప్రయత్నించి నప్పటికీ విధి లేకో? లేక పక్షపాతమో? నేవ్రాస్తే యేంలాభం? చదువరులు నిశ్చయించుకోవాలి? గురువుగారి విషయంలో యీయన యెక్కువగా పరితాపాన్ని వెల్లడించినట్లగుపడుతుంది. అట్టి సందర్భానికి శ్రీవారు సహింపరు. నాకు ఆరోపించినట్లే ముప్పది రెండు కాకపోయినా అధమం యిరవై రెండేనా ఆ విమర్శకుఁడికి కూడా ఆరోపిస్తారు. ఆ కారణంచేత ఆయన పేరు ప్రకటించడం మానినాను. అంతపనిపడ్డప్పుడు అసలు వారికి యేదో సమాధానం చెప్పికొని పేరువగయిరాకూడా ప్రకటిస్తాను. ప్రకటిస్తే మాత్రం "లోకం అంటే యీయనేనాయేమిటి!" అని శంక రావచ్చును. లోకం మాత్రం వక మాదిరిగా వుంటుంది కనకనా? అటు బాగుందనేవారు కొందఱూ, యిటు బాగుందనేవారు కొందఱూ. అంతేకాని యీవివాదకు బీజంయేమి? యెవరో పండితుఁడు ఆయనకు ఆశ్రయమైన స్థానాన్ని గూర్చిపెండ్లికాలంలో చెప్పిన పద్యాలను విమర్శిస్తే విమర్శింతురుగాక. అమంగళాశుద్ధాది పదాలతో తిట్టి, తగులఁబెట్టు మనవచ్చునా? దానిని సమర్ధింపలేక తమకు వ్యతిరేకంగా అభిప్రాయం యిచ్చాఁడన్న కోపంతో శిష్యుఁడిమీఁద గురువుగారు అపవాదలు