పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/779

ఈ పుట ఆమోదించబడ్డది

శాస్త్రిగారి "క్షమాపణ"

883


క. జరిగె సభ భూనభోంతర
   మిఱుకై సందింత లేక; యిరువురకున్ బో
   రరుదుగ జరుగుననుచుఁగొం
   దఱువచ్చిరి, చనిరి తుదకునష్టాశయులై.

ఆ సభనాఁటికి చాలపూర్వమందేమీ శృంఖల గ్రంథాన్ని నేను చూచియున్నాను. అయినప్పటికీ నేనా బాపతు వికారచేష్ట లేమిన్నీ కనపఱచనే లేదని తమ చిత్తానికే విశదంగదా? దీన్ని బట్టి నేను తమకు శ్రీరాములవారికి ఆంజనేయులవంటి భక్తుణ్ణని తమ చిత్తానికే విస్పష్టం. ఇట్టి భక్తుణ్ణి మీరు వదులుకోకూడదు, రెచ్చగొట్టన్నూ కూడదు. ఆంజనేయులు కపి, నేను కవిని. కాఁబట్టి నాయందు కోతిచేష్ట లుండఁగూడదు. మీ శృంఖలగ్రంథం చూచి యెట్లో సహింపఁగలిగాను. కాని హైదరాబాదు వుత్తరం చూచాక నేను స్వతహా కవినైనా కపినే అయి -

శ్లో కపిరపిచ కాపిశాయనమదమత్తో వృశ్చికేన సందష్టః
   అపిచపిశాచగ్రస్తః కింబ్రూమో వైకృతం తస్య.

అనే శ్లోకానికి వుదాహరణంగా మాఱిపోయాను. మాఱితే మాఱుదును గాక, నాస్వంతం కోసం తప్ప మిమ్మల్ని ధిక్కరించడాని కీ వ్యాసాలు ప్రారంభించలేదు. చేయని కృతఘ్నత్వాన్ని నామీఁద మీ రాపాదించారు. అందుచేత మన పూర్వాచారానికి విరుద్ధమైనా అంగీకరించి యీ “గురువుతో గ్రుద్దులాటకి" మొదలేశాను. నాకల్లా కావలసింది, కృతఘ్నత్వం లే దనిపించుకోవడం. అందుకే యీ నా పరిశ్రమ. యిప్పుడు మీరున్నూ పశ్చాత్తాప పడుతున్నారని గ్రహించాను. యేలాగంటారాఁ “యింత కాలం వక విధంగా వెళ్లిపోయింది. శేషం స్వల్పం. అది కూడా యిల్లాగే శాంతంగా వెళ్లిపోతుందనుకున్నాను. వెళ్లి పోనిచ్చాడు కాడు భగవంతుడు." ఈ అక్షరాలు మీ అనుపాతాన్ని పూర్తిగా వెల్లడిస్తూ వున్నాయి. అయితే యేం చేతును? దీనికి భగవంతుడు కారణంగాదు. అనాలోచితంగా మీరు నన్ను గూర్చి వ్రాసిన అక్షరాలు. "పరిణతిరవధా ర్యాయత్నతః పండితేన" కనుక మీరు భావిపరిణామాన్ని వూహించకుండా శృంఖలం వ్రాశారు, అచ్చొత్తించారు. కాని పస్తాయించి నిలుపు చేశారు. ఆ నిలుపు చేయడమేనా యెందుకనుకున్నానంటే నేను

(ఇటీవలి చర్యనుండి)

తే.గీ. లలి "దురుద్ధరదోషశృంఖల"మటన్న
       పేరితోఁ బండితులఁ దూఱుపాఱబట్టు
       చొక్కపొత్త మచ్చొత్తించియును నది తమ
       భావి పెండెరమును భంగపఱచుననుచు.