పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/773

ఈ పుట ఆమోదించబడ్డది



877



శాస్త్రిగారి “క్షమాపణ"

(25-1-1936 సం||ర కృష్ణాపత్రిక నుండి)

చదువరులారా! నేను వ్రాసే సంగతులన్నీ అవసరమైనవే అయినప్పటికిన్నీ శిష్యస్థానంలోని వాణ్ణవడంచేత మన ఆచారాన్నిబట్టి తప్పక పోవని యెఱిఁగి వుండడంచేత ఆదోషం కొంతేనా పోతుందని శీర్షిక ఆలా పెట్టేను గాని యిదిన్నీ"చంక దుడ్డు శరణార్ధి" అన్న సామెతను జ్ఞప్తికి తెచ్చే వ్రాఁతే. గురువుగారు సమాధానం అని వ్రాస్తూ "అది నా ప్రమాదమేమో నని నీవు సమాధానపడవచ్చునే?” అని వక వాక్యం నావిద్యాభ్యాస విషయంలో హైదరాబాదుకు తాము వ్రాసిన వత్తరంలోని "మాఖాంతము వఱకు” అనే సందర్భాన్ని నివారించేదాన్ని వ్రాశారు. దీని వల్ల శ్రీవారివద్ద నేచేసిన విద్యాభ్యాసాన్ని గూర్చి జాతకచర్యలో నా వ్రాసిన వ్రాఁత అసత్యం కాదని లోకులకు బోధపడుతూవుంది. గురువు గారిప్పుడీ మాట వ్రాయడంవల్ల లోకులకు తెలుసుకోవడాని కవకాశం కలిగిందిగాని లేకపోతే కలుగదుగదా! నేను ఆ యీ వ్యాసాలు వ్రాయఁబట్టిగాని వూరకే గురువుగారీ వాక్యాన్ని ప్రచురింపరుగదా! అందుచే నా వ్యాసాలు "నవ్వులపాలవట" కని గురువుగారు వ్రాసిన యీ క్రింది వాక్యాలన్నీ అర్థం లేనివేమో పరిశీలించండి. (1) తవ్వుకోవడం పూడ్చుకోవడం పిచ్చివాళ్లపనిగాని మనపనిగాదు. (2) వ్యాసాలు వ్రాసి పత్రికలు నిండించడానికి ప్రయత్నింపకుము. (3) నవ్వుబాట్ల పాలు గాకుము. ఇది హితబోధమని నమ్ముము. ఇది యిలా వుంచి "సమాధాన పడవచ్చునే" అని వ్రాస్తారే గురువుగారు. నా సమాధానం కోసమా యీ చర్చ, నా జాతకచర్యలో వున్న నా విద్యాభ్యాసపు వ్రాఁతను చదివిన వాళ్లు గురువుగారి హైదరాబాదు వత్తరాన్ని కూడా చదివితే కలిగే సంశయాన్ని పోగొట్టడం కోసమా, అన్నది యిట విచార్యం. ఇప్పుడు చదువరుల కాసందేహం తొలఁగుతుంది. నేను ధన్యుణ్ణి. నా వ్యాసాలు పుట్టక పోతే తమ రామాట యెందుకు వ్రాస్తారు? "నా౽పృష్టః కస్యచిద్బ్రూయాత్" కదా?

యిఁక నేను నవ్వులపాలు గావడాన్ని గూర్చి నేను యితరుల క్కూడా శిష్యుణ్ణయినప్పటికీ తమకున్నూ శిష్యుణ్ణేకదా? అగుచో విద్య మాత్రమే కాక మఱికొన్ని అభ్యాసాలు పట్టుపడడానికి లోకులు విశ్వసిస్తారు. (1) కవిగండ పెండేరాల వృద్ధి -