పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/75

ఈ పుట అచ్చుదిద్దబడ్డది



కొత్తరకం ఈతి బాధలు

యిదివరలో మన పూర్వులు ఆకాలాన్నననుసరించి చెప్పిన యీతి బాధలని గూర్చి వక విపులమైన వ్యాసాన్ని వ్రాసివున్నాను. యిప్పటి దేశకాల పాత్రాలనుబట్టి చూస్తే యెన్నో యీతిబాధలు కొత్తరకాలు కనపడతాయి. యివన్నీ చాలాభాగం యీ యిరవయ్యో శతాబ్దంలోనే యెక్కువ వ్యాప్తిలోకి వచ్చి గృహస్టులను పట్టి పీల్చి పిప్పిచేస్తూ వున్నాయి. యీ బాధలు పట్నవాసాలలో వుండేవాళ్లకి చెప్పనే అక్కరలేదు. పల్లెటూళ్ల వాళ్లని కూడా కొంతవఱకు బాధిస్తూవున్నాయి. వీట్లని యిన్నీ అన్నీ అని చెప్పడానిక్కూడా శక్యంగావున్నట్టు తోచదు. యివి యెప్పటికప్పుడు వుద్బవిస్తూ సంతానవంతులకి మటీ బాధకరంగా వున్నాయి. వాండు బ్రతికి బట్టకట్టే యీడు వచ్చేలోcగానే వాండికి రోజు వక్కంటికి వొకటో రెండో పెట్టెలు సిగరెట్లు లేక బీడీలు వుండితీరాలి. అందులో అనేకరకాలు. వొక్కొక్కటి రు.0-3-0 అణాలుకూడా ఖరీదు వుండే సిగరెట్లు (పెట్టి కాదుసుండీ) వుంటాయనిన్నీ అట్టివి తప్ప తనకు పనికిరావనిన్నీ వక వైదిక బ్రాహ్మణ కులసుండు, పూర్వపురకం ప్లీడరీలో బాగా సంపాదించిన ప్రయోజకుని పౌత్రుండు, విదేశాలకు వెళ్లి అక్కడి విద్య మాత్రం వినాగా తక్కిన అలవాట్లలో చాలాభాగం అబ్బినభాగ్యశాలి చెప్పంగా విన్నాను. అసలు మనదేశంలో వుండే ప్రజలలో వొక్కొక్కనికి యావరేజిని రోజుకి 6 పైసలో, 7 పైసలో ఆర్జన కనపడుతుందని యెవరోప్రాజ్ఞలు వ్రాయంగా యేదో పత్రికలో యెప్పుడో చదివినట్టు జ్ఞాపకంవచ్చి అనుకున్నానుగదా!- యీయన పితామహుండు బాగాగడించి ఇచ్చి పోయినాండు కనక ఈ ఆగర్భ శ్రీమంతుడు, ఈ అదృష్టశాలి ఇంత వెలగల సిగరెట్లరోజూ కాల్చుకుంటూ ఆయన ఆర్జనకు సార్ధక్యాన్ని కలిగిస్తూవున్నాండు, ఇతరులగతియేలాగ? అనివిచారపడ్డాను. ఈలాటివాళ్ల కోసం నానాపాపాలకూ లోcబడి ఆర్జించడం ఎంతేనా అనుచితంకాకపోదు. అయితే బీదలు యీలాటి అభ్యాసాలే మానుకుంటారేమో? అని సమాధానం చెప్పకోcబోయాను, గానికుల్జకారులో సిగరెట్లు నోట్లోలేని వ్యక్రేనాకు కనుపించిందికాదు. సుమారు యిప్పటికి యెనిమిదేళ్లనాఁడు గుడివాడ నుంచి స్వగ్రామానికి జరూరుపనిమీంద రావలసివచ్చి శివరాత్రి రేపనేనాండు చిక్కుగా వుంటుందని యెడింగికూడా రైలెక్కాను. కోటప్పకొండ అడావిడి రోజవడంచేత ఆవేళ రైలులో వున్న తొడితొక్కిడి వ్రాయడానికి వశంకాదు. ఆ రైలులో వక బ్రాహ్మణ కుబ్జవాఁడు అంతకు మునుపు