పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/737

ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీపాదగురువులకడ నా శుశ్రూష

841


ఎవరో యెందులకు? శ్రీవారి సహాధ్యాయి శ్రీ మధిర సుబ్బన్న దీక్షితులుగారున్నచో, కడుసుళువుగా నీయంశము తేలెడినిగాని దురదృష్టవశమున వారు కూడా నిప్పటికిఁ గీర్తిశేషులేయైరి. ఏమైనను దీనికి గురువుగారే నివర్తకులు కావలెను. చదువరులు శ్రీవారిచ్చు నుత్తరమునకు ప్రతీక్షింప వలెను. వారు కృష్ణాపత్రికకు వ్రాయు నాచారములేదు. లేకున్నను దీనిని మాత్రము కృష్ణకే పంపుటకు ప్రార్ధించుచున్నాను. పత్రికవారికిని గురువుగారికిని కొండొక మనఃప్రభేదములున్నను వానిని పత్రికవారు లెక్కింపరు, శిరసావహింతురు. వెనుక నాశాంతి వ్యాసమునకు జవాబు వేరొకపత్రిక కంపుటచే నిట్లభ్యర్ధింప వలసివచ్చినది చదువరు లరయుదురుగాక. మఱియు హైదరాబాదు యుత్తరమును గూర్చి శ్రీవారు తప్పుకొనుటకుc గొంత యుపాయము కలదు. కాని తుదకదియు నిల్చెడి త్రోవ కాదు. అదిగాక "శృంఖలము" లోనివ్రాఁత నేయుపాయమునఁ దప్పి కొందురు? దీనికి శ్రీవారు జవాబిచ్చుచు లోకులను సంతృప్తిపఱుచు పట్టున యుక్తికన్న సత్యమునే యెక్కువడుగ నాధారము చేసికోవలెను. ఇప్పుడు నేను ముఖ్యముగాఁగోరునది శ్రీవారివద్ద నాయొనర్చిన విద్యాభ్యాసమునకు సంబంధించినంత వఱకు మాత్రమే. శ్రీముక్త్యాల రాజావారి వద్ద చాడీలుచెప్పి యుపకరించుట, పాలకొల్లులో మోసగించుట, లోనగు "శృంఖలము” లోని విషయము లక్కఱలేదు. వానికి శ్రీరాజావారే కలరు. పాలకొల్లే కలదు. నాకేల పరిశ్రమ? అన్నిటికిని సర్వసాక్షి భగవంతుఁడే కలఁడుగాని, అయినను పామరత్వము కతన యత్నింపక తప్పినదికాదు. లోకులకు సందియ ముండకుండఁ జేయుటకై శ్రీ గురువు గారికిది నా వినయపూర్వక విజ్ఞప్తి

"చ. నుతజలపూరితమ్ములగు నూతులు నూఱిటికన్న సూనృత
      వ్రత ! యొకబావివేులు, మఱిబావులు నూఱిటికన్న నొక్క స
      త్క్రతువదిమేలు, తత్ర్కతుశతమ్మునకన్న సుతుండుమేలు, త
      త్సుతశతకమ్ముకన్న నొక సూనృతవాక్యము మేలు చూడంగన్."


★ ★ ★