పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/716

ఈ పుట ఆమోదించబడ్డది

820


ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః

(11-4-1931 సం||ర కృష్ణాపత్రిక నుండి)

"అహం న పండితః" ఇయ్యది నా ప్రస్తుత స్థితి. నాకే కాదు, ఈ వయస్సులో నెవరికేని యిదియే శరణ్య మనుకొందును. దీనికి వెనుకటివి కూడ రెండవస్థలు కలవు. అవి, “అహమేవ పండితః, అహంచ పండితః" అనునవి. అవి మాత్ర మీ వయస్సునకుఁ దగినవి కావను కొనియెదను.

క. ఎన్నఁడు జనియించితిమో
    యెన్నఁడు పెరిఁగితిమొ యుద్ధమేటికి మాకో
    యన్నాఁ ముదుసళ్లము భగ
    వన్నామము దలఁచికొనుచు బ్రతికెదము.

ఇట్టిస్థితిలో మూఁడవస్థితికే యీ వయస్సుచితముగాని తక్కుద్వయమున కనౌచిత్య దోషము నాపాదించుననుట నిక్కము. కావున వెనుదీయ వలయును.

క. సంశయము వలదె? రాజక
    వంశక్షయముం బొనర్పవచ్చునె? మౌనీం
    ద్రాంశంబకావొకో నీ
    వోంశాంతి శ్శాంతిఁ జదువకుంటివొ? యెపుడున్.

"నానృషిః కురుతే కావ్యమ్" కనుక కవికిఁ గూడ ఋషి ప్రవర్తన మంతో యింతో అనుకార్యము కాకపోదు. “కలౌషష్టి" కూడా దాఁటినది. ఇపుడు వివాదములకు దిగి యొకరి నధఃకరించి కాని, యధఃకరింపఁబడి గాని పొందవలసిన మేలుకీ ళ్లంతగాఁ గాని, కొంతగాఁ గాని యుండవు. "అధీత మధ్యాపిత మార్జితం యశః" లేదా? అపయశస్సే ఆర్జింపఁబడుఁ గాక, దానినిపుడు పోఁగొట్టికో వశమా? కాదు. మా గురువులలో నొకరగు బ్ర||శ్రీ|| కవిసార్వభౌమ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రులవారు బాల్యమాది చాలా వ్యాసంగము కవితా భాగమున నొనరించినారు. చాల కబ్బములు రచించినారు. తుట్టతుదకుఁ బూర్వ పుణ్యవశమున మహాభారతాంద్రీకరణమున కుపక్రమించినారు. కృతార్థులు కూడఁగా