పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/715

ఈ పుట ఆమోదించబడ్డది

అష్టావధానమంటే!

819

ఈ అవధానవిద్యయందు మొట్టమొదట మేమెంత యాదరాతిశయాన్ని పెట్టుకొన్నప్పటికీ ఇటీవల మాకు అదిపూర్తిగాతగ్గివుండడం చేత మా పిల్లలకి దీన్ని బోధిస్తామని యెవరనుకొంటారు? అనుకోరు. మేము బోధించమైతిమి. మా అవధానంగాని, ఇతరుల అవధానంగాని వాళ్లు యింత వఱకు చూడలేదాయె. ఇట్టి స్థితిలో వీళ్లకి యిందులో వుండే కష్టసుఖాలు యెట్లు బోధపడతాయి? దానికి ఈలాంటి ప్రేక్షకుల వ్రాతలే ఆధారం కావాలి? కనుక ఏవుద్దేశంతో ప్రేక్షకుడు వ్రాసినా మాకుఱ్ఱలు ఆయన్నే గురువులలో వకరినిగా భావించి అవధానమ్మాట అలా వుంచి ముందుగా నిజానికికుత్సితులుగా నుండిన్నీ పైకి మంచిగా నటిస్తూ వుండేవారిని బోల్తాకొట్టించే వుపాయాలు యికనేనా నేర్చుకో వలసిందని మాకుఱ్ఱల్ని ఇందుమూలంగా మందలిస్తూ ప్రేక్షకుడుగారు వ్రాసిన యితర విషయాలని గూర్చి యెత్తికొని గ్రంథం పెంచక ప్రేక్షకుడుగారి యుద్దేశము మంచిదికాకున్నను మాపిల్లల భావిశ్రేయస్సునకు కొంతవఱకిది ప్రోద్బలంగా వుండడంచేత దాన్ని కూడా అభినందిస్తూ యింతతో ముగిస్తున్నాను.


★ ★ ★