పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/711

ఈ పుట ఆమోదించబడ్డది

అష్టావధానమంటే!

815


“శా. పౌరాణోక్తికవిత్వపుష్ప గణనావ్యస్తాక్షరుల్ లౌక్యగం
      భీరో క్త్యంచిత కావ్యపాఠనకళావిద్భాషణంబుల్ ముదం
      బారంగాఁజతురంగ ఖేలనము నీయష్టప్రచారంబు లొ
      ప్పారున్ శంకర ! యేకకాలముననే అష్టావధానమ్మునన్."

ఒకకాలమందే యిన్ని పనులున్ను జరగడమంటే కేవలం అసంభవం కనుక ఒక పనితరువాత ఒక పని, అని అభిప్రాయంగాని వేఱొకటి కాదని ప్రాజ్ఞులకు విస్పష్టమే. ఈ విషయమే మాకుఱ్ఱలీమధ్య వీరవరంసభలో ప్రస్తావవశంగా "అట్లు చెప్పుట త్రిమూర్తులకైనా శక్యంగాదు" అని చెప్పినారట. అట్లంటే యెట్లు? క్రమంగాగాక ఎనిమిది పనులున్ను ఒకటే మాటుచేయడం అని వీళ్ల అభిప్రాయమై వుండగా అవతలివారెవరో పేరు దాచుకొని “ప్రేక్షకుడు" అనుకల్పితపు పేరుతో వ్రాసేవ్యాసంలో ఇట్లు వ్రాసినారు. "మాయందు త్రిమూర్తులకైనను తప్పుపట్టుటకు అసాధ్యమని నొక్కి చెప్పి అవధానోప క్రమణమునకు గడంగిరి" (29–7-35 సం. త్రిలింగ చూ.)

ప్రేక్షకుని వ్రాతకున్ను మాకుఱ్ఱలప్రసంగమునకున్ను సంబంధమే కనుపడదు. పోనీ ప్రేక్షకుణ్ణి అడుగుదామంటే ఆయనయెవడో మనకు తెలిసేదెట్లు, ఆయన నిజమే వ్రాస్తా రబద్ధంవ్రాయరనుకొందామా? అట్లా వ్రాసేటట్టయితే పేరు దాచుకోవలసి వుండదుకదా. అందుచేత ఈ ప్రేక్షకుడు మనస్సులో మాయికుఱ్ఱల మీద ఏదోద్వేషకారణం కలిగి యీవ్రాతకు దిగినట్లూహింపవలసి వచ్చింది. ఆ ప్రేక్షకుడు ద్వేషం చేత వ్రాసినా, లేక స్నేహంచేత వ్రాసినా, మా పిల్లలకు లోకజ్ఞానం నేర్చుకోవడానికి మార్గదర్శకునిగా వుండడం చేత నేను అతణ్ణి ఆశీర్వదిస్తున్నాను. పేరు ప్రకటించకపోవడంచేత మాకుఱ్ఱలు తప్పికోవడానికి అనగా మేమట్లనలేదని దాటుకోడానికి అవకాశం కలుగుతూవుంది. అది అలావుంచుదాం. ఈ అష్టావధానం పైని మీరు చెప్పిన ప్రకారమే చేయవలెనా? మఱొకలాగు కూడా చేయవచ్చునా? అని కొందఱడుగ వచ్చును. వినండి, మేము వినికినిబట్టి పూర్వులు చేసిన విధానాన్ని పురస్కరించుకొని లక్షణం వ్రాశాము. వీనియందు లక్ష్యమున్నవా రీలా చేయవచ్చు, లేనివారు మార్చుకొన్నను మార్చుకోవచ్చును; వీరవరపుసభలో మాకుఱ్ఱలు చదరంగానికి బదులుగా ఇప్పుడు క్రొత్తగా వచ్చిన "క్యారెంబోర్డు" అనే ఆటను పెట్టుకొన్నట్లు ప్రేక్షకుడుగారే వ్రాశారు. ఇంతేకాక ఈ క్రొత్తయాటకు బుద్ధిబలంతో అంతగా పనిలేదని కూడా ప్రేక్షకుడుగారే వ్రాశారు. ఈ విషయంలో ఆయన వ్రాసిన యక్షరాలన్నిన్నీ బాగానే వున్నాయని అంగీకరిస్తూ నాకు తోచిన మఱికొన్ని మాటలు వ్రాస్తున్నాను. "క్యారెంబోర్డు"