పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/699

ఈ పుట ఆమోదించబడ్డది

మహాకవి భోజమహారాజు

803


కగువ్యయములో నెన్నవవంతుగాని దీనికి వ్యయముగాని వారి ప్రశంసకుఁగా నిందఱుధర్మ ప్రభువుల నీసడించుచు “ఎవరు నాయనలారా?" అని ప్రశ్నించు పంతులవారి వాక్యమున కర్థ మగుపట్టదు. శ్రీపంతులవా రొకపరి సువర్ణ లేఖలో నొక వ్యాసమును. వ్రాసియున్నారు. ఆ వ్యాసపరమార్ధము పిఠాపురపుc గవితాపరీక్షకు సంబంధించినదియే. అపుడు పంతులవారు తత్సంస్థానమున నుండనిదినములు. కవిత్వముమాట నటులుంచి సాహిత్యము మాట వదలుకొని శ్రీ పిఠాపురాధీశు లేమహాకవుల నాదరించిరో, ఏ మహాకవులఁ బరీక్షింపించిరో, ఏ మహాకవులం బరీక్షకులుగా నేర్పరచిరో ఆయా మహాకవులలో శ్రీరాజాగారిని గూర్చి యెవరుగాని రచించిన దొకపద్యమునేని కవిత్వ మనిపించుకొనదగినది చూపుచు లోకసంతుష్టికై యొక వ్యాసము వ్రాయఁ బ్రార్థితులు. అపుడు కొంతకాకున్నఁ గొంతేని "భోజోపమితి" యన్వర్థ మగును. తగు పరీక్షకుల నేర్పరచిన మఱునాఁ డెందఱో కవులు రాఁగలరు. ఈ యంశమును నాఁడు పంతులవారి వ్యాసమే స్ఫుటపఱచినది. వారును మఱిచి యుండరు. మేము వారికి 19 వత్సరముల క్రిందటఁ బ్రసక్తాను ప్రసక్తముగా వ్రాసిన “ఆంధ్రకాళిదాస బిరుదము" మఱువ లేదు. పంతులవారపుడు దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి తమ్మనశాస్త్రులవారిచేఁ గాఁబోలును గవితావిషయమున నాక్షేపింపఁబడి సమాధాన సందర్భమునకై మాలోనొకరి పేర వ్రాసిన యుత్తరముపై మే మాయాక్షేపణలు సరికా వని వ్రాయుచు నా బిరుదమును హృదయపూర్వకముగా వ్రాసితిమి. అటు లొసఁగిన యా బిరుదమును వారెందును బ్రచురింపక వారి యహంకారశూన్యతకుఁ దావలముగా దాఁచి పెట్టిరి. వారి వినయాధిక్యమున కది స్ఫోరకమని వారనుకొన్నను మే మొసఁగిన మీఁదట వారటులొనరించి రనుకొనుటకు లోకుల కేమి యాధారము కలదు? ఇంతవఱ కాధారము లేక యిపుడు వారు పీఠికాపురాధీశ్వరుల కొసఁగిన "ఆంధ్రభోజ బిరుదము" ద్వారమున దానికిఁ గలప్రసక్తి బయలఁ బడుటచేఁ బంతులవారియనౌద్ధత్యము వెల్లడియైనదని మేము సంతసించుచున్నారము. మే మిడినబిరుదము వారిపుడు ధరింప కుండుటకు వారి యనౌద్ధత్యమే కాక కాలదోషము కూడఁ గారణమని మేమూహించుచున్నారము. ఒక పుష్కరము దాఁటి రెండవ పుష్కరపూర్తి కావచ్చుచున్నది గదా? వినయార్ధము వారు ధరింపకున్నను మేము మరల మరల వారి నీ బిరుదమును ధరింపవలసినదని ప్రార్థించుచున్నారము. ఏమందురా? వారు కవులు, పరిశీలకులు. “ఇదంబ్రాహ్మ మిదంక్షాత్రం" అను తెఱఁగున నాంధ్రమందును రాజకీయ విద్యయందును నిష్ణాతులు. ఇట్టివారు శ్రీ శ్రీ పిఠాపురాధీశులను “ఆంధ్రభోజుఁడు" అని వాడిరిగదా? “సత్కవి వాక్యము రిత్త వోవునే" కనుక ఋషివాక్యమునకుంబలె దానికి సార్థక్య కల్పన మావశ్యకము. "నానృషిః