పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/692

ఈ పుట ఆమోదించబడ్డది

796

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


నంశమును మనమం దుంచికొని కోళగావ్రాసి గుంటూరుసీమ యుత్తరరంగమున దానిపై వ్రాసిన మాసమాధానమువలననో? అంతకుమున్నో వ్రాసిన సుదర్శినీ పత్రికాధిపతి వ్రాఁతవలననో మనసు పశ్చాత్తప్తమైనదనుట కాయన తిరిగియు దానిఁగూర్చి లవమునువ్రాయకుండుటచేతనే సహృదయులు గుఱితింపఁగలరు. ఇది వివేకుల లక్షణము కాదా? భ్రమప్రమాదాది దోషభూయిష్ఠమగు మనుజుని మనసొకప్పుడు కుమార్గమునఁ బడవచ్చును. పిమ్మట నితరుల యుపదేశము వలననో స్వయం ప్రబుద్ధతకతముననో క్రమమార్గము స్ఫురింపవచ్చును. స్ఫురించిన పిమ్మటఁ గూడ “తాఁబట్టిన కుందేటికి మూడేకాళ్లు" అని వెఱ్ఱివెఱ్ఱి వ్రాఁతలు వ్రాయఁబూనుట యవివేకుల లక్షణము, వెం.రా.లకో? ఈ కర్మము తెలియని హేతువున నింకను “దేశభక్తి వ్యాఖ్యానములు వ్రాసి ప్రజలచీవాట్లకుఁ బాల్పడవలసి వచ్చుచున్నది. అయ్యో! “యరలవమదనస" పద్యమునకు వ్యాఖ్యాన మెవ రపేక్షింతుకో గదా? భవతు. దీనిగతి ముందు విచారింతము. ప్రస్తుతము శ్రీ పంతులవారి నీప్రశ్నమున కుత్తర మడిగి విరమింతము.

ఉ. పెంపుడుజంతు వొక్క యెడఁ బేరినయామున మేనెఱుంగమిన్
    దంపులమారియై యొకని దాఁగఱచెన్ వెస వాఁడు జంతువున్
    జంపుటో, కొట్టుటో యొకటిసల్పుట యుక్తమొ? పెంచునామహా
    సంపదుదారుతోఁ దెలిపి జంతువునా మడఁగించు టర్హమో.


★ ★ ★