పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/69

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈతి బాధలు

73


ఆ యాగకర్తకు మాత్రం పుణ్యలోకమే వచ్చినట్టున్ను తుదకు ఆ యాగకర్త తన పురోహితుcడి క్కూడా శిఫారసుచేసి ఆ నరకబాధను తప్పించినటూన్నూ దానిలోనే కనపడుతుంది. యింతకన్న నరమేధాలకు ఉదాహరణాలు కనిపించవు. పూర్వయుగంలో రంతి దేవుండు కాcబోలును గోమేధాలు యెన్నో చేసినట్టుకనపడుతుంది. కాని అందులో గోవులు స్వయంగా వెళ్లి పుణ్యలోకావాప్తి కొరకు ఆ మహారాజును ప్రార్థిస్తే ఆయన అంగీకరించినట్టు కనబడుతుంది. అంతేనేకాని బలవంత బ్రాహ్మణార్థ ప్రకరణం లేశమున్నూ లేదు. యీ యుగంలో ఆ గోమేధం జరగడానికి వల్లకాదని మహరులేలాగో - “కలె" పంచ విసర్జయేత్ అని పుణ్యం కట్టుకోవడమైతే జరిగింది గాని అయితే యేంలాభం? ఆ ధర్మశాస్తాలకు కట్టుంబడని మహానుభావులు ఆ రంతిదేవుణ్ణి మించిన యాగాలు చేస్తూవున్నారు. ఆ చర్మాలరాసులవల్ల బయలుదేటిన నీరు ముడికి నీరుగా వుండడానికి బదులు మహాపవిత్రమైన జలంకలనదిగా ప్రవహించినట్టు మన పురాణాల్లో వ్రాయంబడి వుందిగాని యీ చర్మాలవర్తకులు కోటీశ్వర్లై యెంతో పేరుప్రతిష్టలు గణించినట్టు మనకు ప్రత్యక్షదృష్టాంతమే కనపడుతూవుంది. పురాణగాథలతోవ పురాణాలదీ మనతోవ మనదీగా వుండడంచేత ధర్మాధర్మనిర్ణయం చాలా దుర్ఘటంగా కనపడుతూవుంది. "సత్యంబ పల్కంబడున్” అనే ప్రతిజ్ఞతో ముక్కుమూసుకొని జపతపాలతో కాలక్షేపం చేస్తూవుండే “తృణీకృత బ్రహ్మపురందరులు" మహరుల కేమంతకర్మం కాలిందని అబద్ధాలు వ్రాసి లోకాన్ని మోసపుచ్చడానికి? నాన్ బ్రామిన్సులో కొన్ని తెగలవారు యిప్పడు చెప్పేమాటలు చూస్తే "ఋషులేమో బ్రాహ్మణజాతికి సంబంధించిన వాళ్లనిన్నీ అందుచేత బ్రాహ్మణుల కనుకూలంగానున్నూతమకు అననుకూలంగానున్నూ గ్రంథాలు వ్రాసి తమకు మహాద్రోహం చేశారంటూ కనపడతాయి, కాని ఆ ఋషులలో కొందరు జన్మతః బ్రాహ్మణులు కానివారు, క్షేత్రతః బ్రాహ్మణులు కానివారుకూడా వున్నట్లు గ్రంథాలవల్లనే అవగత మవుతుంది - అట్టివాళ్లకూడా తమకు వ్యతిరేకంగానే లిఖించివుంటారా? అనే ప్రశ్నకు జవాబు కనపడదు. మొట్టమొదట యీ వ్యాసం ప్రారంభించడమేమో? యీతిబాధలనుగూర్చి దానిక్కారణం యింట్లో మిక్కిలిగా విజృంభించివున్న యొలకల యొక్కానున్ను పందికొక్కులయొక్కానున్నూ కోలాహలాతిరేకం. యిప్పడు ఋషుల పురాణాలు విషయంగా నడుస్తూవుంది. దీన్ని చూచి లోక మేమనుకుంటుంది? వ్యాసకర్త మతిమాలినవాడని అనుకుంటుంది. లేదా? “కొండనిత్రవ్వి యొలకను పట్టడం అంటే యిదేకాCబోలు"ననేనా అనుకుంటుంది. 55 యేళ్లు దాఁటినవాళ్ల బుద్ధి స్థిరంగా వుండదనే మాటకు అంతతో నవకరీనుంచి తొలంగించి యెందటినో యింట కూర్చోం బెట్టి పోషిస్తూవున్న మన గవర్నమెంటు ప్రవృత్తివల్లనే అందఱూ