పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/678

ఈ పుట ఆమోదించబడ్డది

782



అడియాస

శ్లో. కతిపయదివసైః క్షయం ప్రయాయాత్
    కనకగిరిః కృతవాసరావసానః
    ఇతి ముద ముపయాతి చక్రవాకీ
    వితరణశాలిని వీరరుద్రదేవే.

ఈ శ్లోకం ప్రతాపరుద్రుని దాతృత్వాన్ని గూర్చి రచించినది. ప్రధానంగా అతిశయోక్తి అలంకారం వుండఁగా మరికొన్ని యేవో అలంకారాలు వుంటాయి విజ్ఞులు పరిశీలిస్తేను. యిప్పుడీశ్లోకాన్ని వుదాహరించి వ్యాఖ్యానించవలసిన ఆవశ్యకత యేంకలిగింది అని ప్రశ్నిస్తే జవాబు - “పనిలేని మంగలి పిల్లితల గొఱిగాడు" అనే లోకోక్తిని వుదాహరించడమే. అంత మాత్రంతో ప్రశ్నించిన పెద్దమనిషి తృప్తిపడకపోతే పెద్ద అక్షరాలలో చిత్రించిన “అడియాస” పదం ముక్తకంఠంతో వేయినోళ్లతో ఘోషిషిస్తూవుండఁగా వొకరివివరణం అనావశ్యకం అని మూఁగనోము పట్టడం. సరే యీశ్లోకం ప్రతిపదమూ పరిశీలిస్తే తేలే ముఖ్య తాత్పర్యం.

అనఁగా అనఁగా వొకరాజన్నట్టే - వొక ఆఁడచక్రవాకప్పక్షి. ఆ యీపక్షి సుప్రసిద్దుఁడైన వోరుగంటి ప్రతాపరుద్రుని కాలంలో పిల్లా జెల్లా, తానూ భర్తా సుఖంగా వోరుగల్లు పరిసరారణ్యాలలో కాలక్షేపం చేస్తూవుండేది; గాని ప్రతిదినమూ దీనికి దుర్భరమైన భర్తృవియోగదుఃఖం రాత్రి యావత్కాలమూ అనుభవించడం తప్పేదికాదు. యీ దుఃఖాన్నుంచి తప్పించుకోవడం యేలాగా అని ఆలోచిస్తూవుండఁగా సర్వసాధారణ స్థితిలో వున్న “ప్రతాపరుద్రమహారాజులుం గారి" దాతృత్వం-

శా. ఇంతింతై... అంతై ... యెంతో ఐ ... యేమోఐ ... నభో వీథిపై.

అనేపద్యాన్ని జ్ఞాపకంచేసే స్థితిలో వుండేటప్పటికి చక్రవాకికికూడా తెలిసింది. తెలిసి దానికి రాత్రికాలం యావత్తూ వియోగం కవి సమయసిద్ధం కనక యీపయిని ఆవియోగాన్ని కలిగించే రాత్రినే చూడవలసిన ఆవశ్యకత నాకు కాదు యావత్తూ లోకానికిన్నీ తటస్థింపదు. యేమంటే రాత్రింబగళ్ల భేదము యే పర్వతం అడ్డురావడంవల్ల కలుగుతూవుందో ఆపర్వతం (మేరువు) యావత్తూ-బంగారుమయం. కనక నేఁడో రేపో చిల్లరకొట్లలో యిటుకలుగా