పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/677

ఈ పుట ఆమోదించబడ్డది

అంతా రామమయం

781


చింతాకంత అనే ప్రయోగించేవాఁడు. యీలాటివెన్నోవున్నాయి. వ్రాసే వోపిక లేదు. "జీర్ణమంగే సుభాషితమ్."

తక్కినయావత్తు వాదమూ ఆలావుంచి కీ. శే. గిడుగుపంతులుగారి వాదంలో సముచ్చయం లోపించి దానికి పూర్వ మందున్న అచ్చుకు దీర్ఘం వస్తుందనే మాటమట్టుకేనా శిరసావహించ వలసి వుంటుందని నేననుకుంటాను ఉదాహరణం - అంత+యు రామమయము (యు లోపించి) అంతా రామమయము. రామదాసు పదకవిగాని కవిధూర్జటిపదకవికాఁడు. అతఁడు వక పద్యం యావత్తూ, అంతా, అంతా, అనే దీర్ఘాంతాలే నింపి పూరించాఁడు. అంత అనేదానికి యు, అనేది చేరిస్తే రాదుగాని దీర్ఘాంతమైనప్పుడు అందఱు, అనే అర్థం కూడా వస్తుంది. అంతావచ్చారా? యింకో విశేషం దీర్ఘాంతానికి యావత్తూ అని యేకవచనంలో అర్థం చెప్పుకోవలసి వస్తుంది. యేదో యీలా కిందా మీఁదా పడుతూవుంటే యేవో తోస్తూనే వుంటాయి శంకాసమాధానాలు. యిప్పటికి దీన్ని ముగిస్తాను.


★ ★ ★