పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/675

ఈ పుట ఆమోదించబడ్డది

అంతా రామమయం

779


హృద్యాలు కావని నేననేదిలేదు కాని నేను చూపిన యీ పద్యం లాక్షణికులు వుత్తమకవిత్వానికిచెప్పిన (జీవితం వ్యంగ్యవైభవమ్) సూత్రానికి ప్రథమోదాహరణం కావడమే కాక కూర్పువిషయంలో కూడా మిన్నగా పరిగణించఁ బడుతుందనిన్నీ ఛందోబద్ధంగా వుంది కనక దీన్ని పద్యమనుకుంటూ వున్నాంగాని ఆలాగే కాకపోతే యిది వచనమే అనుకోవచ్చుననిన్నీ నా తలఁపు. తీగదీస్తే డొంకకదులుతుంది. అసలు వ్రాయడానికి పెట్టుకొన్న విషయంవేఱు. గద్య పద్య కవిత్వాలకు వుండే భేదం వ్యాఖ్యానించవలసివస్తే కొంత పెరుంగుతుంది కనక వుపేక్షిస్తాను. యెంతటి మహాకవి రచించినాక పద్యమనే టప్పటికల్లా యతికో, ప్రాసకో, గణానికో వ్యర్థపదంపడి తీరుతుందనిన్నీ వొకవేళ ఆపదం అవసరమేఅని రచయిత సమన్వయించినా అది లోఁగడ చెప్పిన స్థానాలలో వుంటే వ్యర్థపదంగానే పరిగణించఁబడుతుందనిన్నీ గద్యకు యీ కళంకాన్ని కల్పించడానికి అవకాశమే కలగదనిన్నీ చెప్పితే ప్రస్తుతం చాలుననుకుంటాను. నన్నయ్యగారు పద్యంగానే చిత్రించినా వొక్క లఘువుగాని, గురువుగాని యితరులు సవరించడానికి చోటులేదు. సవరించడానికే చోటు (అవకాశం) లేకపోతే యిదే తాత్పర్యాన్ని మఱివొక పద్యంలోఁగాని లేదా అదేపద్యంలోనేకాని యిమిడ్చి కవితసాఁగించి లోకాన్ని మెప్పించఁగలమా? నామట్టుకు చేతగాదన్నంతవఱకే నాకధికారం. అది ఆలావుంచుదాం. క్రియాకారకాన్వయాన్ని కుదుర్చుకుందాం. "నన్ను పెండ్లాడుము" అని వ్యావహారిక భాషలో వుంటుంది. ఆపద్ధతిని చేయుము అనేక్రియకు ఆత్మనేపదార్థకంగా (కొనులేకుండా కూడా ఆత్మనే పదంవుంటుంది) చేసికొనుము అంటే సమన్వయిస్తుంది. కొంతమంది సంస్కృత భాషామర్యాదనుబట్టి సమన్వయించడానికి పూనుకొని తికమకపడతారు. ఆపద్ధతిని పైవాక్యం “మాంత్వం వివాహంకురు" అని కావలసివస్తుంది. కాని సంస్కృతభాషా మర్యాద నెఱిఁగిన కవిమాత్రం పైవాక్యాన్ని యేవగించుకుంటాఁడు. తెలుఁగులో నన్ను పెండ్లిచేసుకో అనడంకంటేకూడా నన్ను పెండ్లాడు అనేదానికే ప్రాచుర్యం. “నన్ను పెండ్లాడవే చెంచీతా మేనత్తకూఁతురవె చెంచీతా" పద్యంలో యే మాటలలో వున్నా భావంమాత్రం పెండ్లాడుము అనేదే. అయితే చేయుము అనేదానికి ఆడుము అనే అర్థం వస్తుందా? అంటే వినండి. చేయుము అంటేరాదుగాని, దానికి ఆత్మనేపదంగా చేసికొనుము, అని అర్ధంచెప్పుకొనే పద్ధతిని అదే అర్ధం ఫలితమౌతుంది. క్రియలో మాట యే కవి కవిత్వంచెప్పినా వ్యావహారికం భావాల మీఁద ఆధారపడే చెప్పాలి. ఆడుధాతువుకు వెనకాల మాట అనేపదం చేరిస్తే ఉచ్చరించు అనిఅర్థం వస్తుంది. ఉపపదం లేకుండా వుపయోగిస్తే నృత్యంచేయు అని అర్థం వస్తుంది. ఆయీ ధాతువుకు చివర “పోయు” ధాతువును చేర్చి అసలు ధాతువును క్వార్థకంగా మాఱిస్తేనో? నిందించు అనే అర్థం రావడమేకాదు. మితిలేని రీతిని నిందించుట అనికూడా